“నాన్నకు ప్రేమతో” ధియేటర్ పై రాళ్లు రువ్విన అభిమానులు!

ntr fans stones pelted on Nannaku Prematho theatresసినీ రాజధాని విజయవాడలో “నాన్నకు ప్రేమతో” సినిమా ప్రదర్శిస్తున్న రాజ్- యువరాజ్ థియేటర్స్‌పై అభిమానులు రాళ్లు రువ్వారు. తమ అభిమాన హీరో సినిమా టికెట్లను కౌంటర్ లో విక్రయించకుండా, బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

“నాన్నకు ప్రేమతో” సినిమా మొదటి షోను చూడాలన్న ఆశతో వచ్చిన అభిమానగణానికి బ్లాక్ టికెట్ల ధరలు ఆకాశాన్ని చూపించాయి. దీంతో సినిమా చూడలేకపోతున్నామనే ఆగ్రహంతో ధియేటర్ పై రాళ్లు విసరడంతో రాజ్ – యువరాజ్ అద్దాలు పగిలిపోయాయి.

ఈ క్రమంలో థియేటర్ ప్రాంగణం వద్ద చోటు చేసుకున్న స్వల్ప ఉద్రిక్తతను నియత్రించడానికి పోలీసులు రంగప్రవేశం చేసారు. దీంతో థియేటర్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఇదే సయమంలో ఎన్టీఆర్ కటౌట్లకు పాలాభిషేకం చేసి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories