అభిమానిపై ఎన్టీఆర్ ప్రేమకు ఫిదా అయిన ఫ్యాన్స్!

Jr NTR Cancer Fan Nagarjuna,Jr NTR Meets Cancer Fan Nagarjuna,Jr NTR Meets Cancer Fan Nagarjuna Bangalore,Jr NTR Meets His Fan Nagarjuna,NTR Meets Nagarjuna హీరోలను దైవాలుగా కొలిచే స్వభావం మన సినీ అభిమానులది. అలాంటి అభిమానమే వారికి పునర్జీవం కూడా ఇస్తుందన్న సంగతి గతంలో పవన్ కళ్యాణ్ – శ్రీజల సందర్భంలో వెలుగు చూసింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కాన్సర్ జబ్బుతో బాధపడుతున్న నాగార్జున అనే ఓ అభిమాని వద్దకు వెళ్లి పరామర్శించారు.

కాన్సర్ చివరి దశలో ఉన్న నాగార్జునకు జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఓ ఫోటో కూడా దిగాడు నాగార్జున. తన అభిమాన హీరోను చూడాలన్న చివరి కోరికను తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం బెంగుళూరులో చికిత్స చేయించుకుంటున్న నాగార్జునను స్వయంగా వెళ్లి పలకరించాడు.

ADVERTISEMENT

తమ అభిమాన హీరోనే కళ్ళ ముందు సాక్షాత్కరించే పాటికి నాగార్జున కొంత సమయం పాటు తన జబ్బును మైమరిచిపోయి, తన అభిమాన హీరోను చూస్తూ సమయం గడిపాడు. అభిమానికి వచ్చిన విషాదానికి జూనియర్ కూడా తీవ్ర నిరాశ చెందుతూ, నాగార్జునతో కొద్ది సేపు గడిపారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories