జూనియర్ ఎన్టీఆర్ పెద్ద షాకే ఇచ్చాడంట!

NTR Kalyan Ram, NTR Kalyan Ram Birthday Party,NTR Kalyan Ram Surprise Gift, NTR Kalyan Ram Surprise Birthday Party, NTR Kalyan Ram Relationనందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితులు, పలువురు సినీ సెలబ్రిటీల మధ్య జరిగిన పార్టీలో తన అన్నయ్యకు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద షాకే ఇచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముందుగా తన ‘స్వరం’తో సోదరుడికి ‘హ్యాపీ బర్త్ డే’ పాట ఆలపించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగా, తమ్ముడి ఆప్యాయతకు పడిపోయిన కళ్యాణ్ రామ్ వెంటనే ఓ హాగ్ ఇచ్చి ఆనంద భాష్పాలు రాల్చాడట.

ఇక్కడితో ఆగని జూనియర్, ఎప్పటి నుండో తన అన్నయ్యకు ఇవ్వాలనుకుంటున్న అత్యంత ఖరీదైన బహుమతిని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ కు బహుకరించి తనలో ఉన్న ప్రేమను చాటుకున్నాడని సినీ వర్గాల సమాచారం. జూనియర్ చేసిన హంగామాతో పార్టీ అంతా సందడి సందడిగా మారిపోయిందట. హైదరాబాద్ లోని బ్లూ ఫాక్స్ హోటల్ లో జరిగిన ఈ వేడుకలో హరీష్ శంకర్, పూరీ జగన్నాధ్, కొరటాల శివ, వక్కంతం వంశీ, సుబ్బరాజ్, అజయ్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

అన్న అంటే జూనియర్ కు మొదట నుండి అభిమానమే. గతంలో జరిగిన పలు ఆడియో వేడుకల పైన కూడా కళ్యాణ్ రామ్ పై ఉన్న అభిమానాన్ని, ప్రేమను వ్యక్తపరిచాడు. ఇప్పటివరకు తన అన్నయ్య ఒకరికి పెట్టడమే కానీ, ఒకరి నుండి ఆశించింది లేదంటూ ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఈ అన్నదమ్ముల అనుబంధం చూసి అభిమాన గణం కూడా మిక్కిలి సంతోషిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories