పాత 500, 1000 నోట్లు ఇంకా ఉన్నాయా… అయితే మీకో ఛాన్స్..!

500 1000 notes demonetization Foreseenగతేడాది నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత, పాత 500, 1000 నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవడానికి డిసెంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. సదరు గడువు తేదీ లోపున దాదాపుగా 90 శాతంకు పైగా మొత్తం ఆర్బీఐకు చేరినప్పటికీ, సామాన్యుల వద్ద ఇంకా కొంత మొత్తం, తెలియకుండానే ఉండిపోయిందన్న విషయం వెలుగులోకి రావడంతో, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అందుకు అనుగుణంగా ఓ నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం.

ఇంకా పాత 500, 1000 నోట్లు కలిగి ఉన్న వారికి చివరిసారిగా ఒక అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్కరు 2000 వేల రూపాయలు గరిష్టంగా బ్యాంకులలో డిపాజిట్ చేసుకునే విధంగా ఉండబోతున్న ఈ నిర్ణయం కొద్ది రోజులకు మాత్రమే పరిమితం చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కౌంటర్లలో డిపాజిట్ చేసుకునేందుకు మార్చి 31వ తేదీ వరకు సమయం ఉన్నప్పటికీ, ఆర్బీఐ కౌంటర్లు అన్ని చోట్ల అందుబాటులో లేవు గనుక, బ్యాంకులలో డిపాజిట్లు చేసుకునే విధంగా నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories