“ఊపిరి” ట్రైలర్ టాక్ – ఫుల్ క్లారిటీ వచ్చేసింది!

oopiri-trailer-talk-full-clarity-nowనాగ్ ప్రభంజనం ప్రారంభం కావడానికి మరో 14 రోజులు మాత్రమే మిగిలి ఉందని “ఊపిరి” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది. ‘మనం, సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలతో మాంచి ఊపు మీదున్న నాగ్ కు “ఊపిరి” సినిమా మరో మలుపులా కనపడుతోంది. సినిమా కధలోని డెప్త్ ను రివీల్ చేయనప్పటికీ, సినిమా ఏ విధంగా సాగుతుందో ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

దాదాపు 130 సెకన్ల పాటు సాగిన ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ పంథాలో నడిచింది. అద్భుతమైన లొకేషన్స్, దానికి తగిన విధంగా ఉన్న ఫోటోగ్రఫీ, సూపర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… అన్ని కలగలిపి మంచి ఫీల్ గుడ్ చిత్రంగా “ఊపిరి” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘మున్నా, బృందావనం, ఎవడు’ సినిమాల దర్శకుడు వంశీ పైడిపల్లి నుండి ఆశించని విధంగా “ఊపిరి” సినిమా రూపుదిద్దుకుందని స్పష్టమవుతోంది. మార్చి 25వ తేదీన విడుదల కాబోతున్న “ఊపిరి”పై భారీ అంచనాలను పెంచేందుకు ఈ ట్రైలర్ దోహదం చేస్తుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories