‘ఆపరేషన్ దుర్యోధన’ పేరుతో సంచలన విజయాన్ని పోసాని – శ్రీకాంత్ లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమాను బేస్ చేసుకుని, ఆ తర్వాత అనేక ‘ఆపరేషన్లు’ టాలీవుడ్ లో పుట్టుకొచ్చాయి గానీ, ఏదీ విజయం సాధించలేదు. తాజాగా మరో ‘ఆపరేషన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీకాంత్ హీరోగా ‘ఆపరేషన్ 2019’ పేరుతో త్వరలో విడుదల కాబోతోన్న సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
రెండు నిముషాల నిడివి గల ట్రైలర్ లో ఎక్కువ శాతం బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో కూడిన యాక్షన్ అండ్ పొలిటికల్ సీన్స్ ను కట్ చేసారు. ‘”గాంధీ కడుపున గాంధీ పుట్టడు… ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు… మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు… ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకు రావలసిందే…” అని శ్రీకాంత్ చెప్పే డైలాగ్స్ మాత్రమే ఈ ట్రైలర్ లో ఉంచారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఈ ఆపరేషన్ ఎంతవరకు ప్రేక్షకులను రక్తి కట్టిస్తుందో చూడాలి.



