కాంగ్రెస్ పార్టీకి బిజెపి రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తోందా?

Amit Shah's Hyderabad Padayatra: BJP Targets Congress

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేసి మోడీ ప్రభుత్వానికి అగ్ని పరీక్ష పెట్టింది.

ఇప్పుడు బిజెపి కూడా సరిగ్గా అదే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోబోతుండటం విశేషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంతో బిజెపి ఆ పని మొదలుపెట్టింది.

ADVERTISEMENT

తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో నవంబర్ 2న హైదరాబాద్, ట్యాంక్‌బండ్‌పై మహాపాదయాత్ర నిర్వహించడానికి సిద్ధమయ్యింది.

దీనిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆ హోదాలో ఉన్న ఆయన పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో , జాతీయ స్థాయిలో బాగా హైలైట్ అవుతుంది.

ముఖ్యంగా ఆయన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరుపై తీవ్ర విమర్శలు చేయడం ఖాయం.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు అమిత్ షా, రాష్ట్ర బిజెపి నేతలు చేయబోయే విమర్శలతో మరింత ఇబ్బంది పడుతుంది.

ఈ మహా పాదయాత్ర కేవలం ‘ఎస్ఐఆర్’కి మాత్రమే పరిమితం కాదు.

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిజెపి తప్పకుండా అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ఉంది.

నవంబర్ 5వ తేదీన కరీంనగర్లో బిజెపి మరో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. బహుశా దానిలో కూడా అమిత్ షా పాల్గొనే అవకాశం ఉంది.

కనుక ఈ మహా పాదయాత్రలో ఆ లక్ష్యం కూడా ఇమిడి ఉందని భావించవచ్చు.

కాంగ్రెస్, ఇండియా కూటమి, బీజేపీ వ్యతిరేక శక్తులు కలిసి చేస్తున్న ఆందోళనతో బిజెపి అధిష్టానం కొంత తడబడి మాట వాస్తవం.

కానీ ఇప్పుడు పూర్తిగా తేరుకుని వాటికి అదే స్థాయిలో దీటుగా జవాబు చెప్పేందుకు సిద్ధమవుతోంది.

పనిలో పనిగా, కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఈ విధంగా పావులు కదుపుతోంది.

తద్వారా ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories