ఫస్ట్ డే రిలీజ్ @ఫేస్ బుక్!

Controversial Film Padmavati Overseas Release Before Indiaగత రెండు నెలలుగా దేశమంతా హాట్ టాపిక్ గా మారిన “పద్మావత్” సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ లో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. కేవలం సినిమా ధియేటర్లలోనే కాక, ఫేస్ బుక్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కావడం విశేషం. అధికారికంగా కాదులేండి… పైరసీ రూపంలో “పద్మావత్” సినిమాను ఫేస్ బుక్ లో లైవ్ నిర్వహించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

‘జాతోంకా అడ్డా’ అనే ఫేస్ బుక్ పేజీ ఈ సినిమాను లైవ్ ఇవ్వగా, లేటెస్ట్ న్యూస్ ప్రకారం దాదాపుగా నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. అలాగే మరో 15 వేల మందికి పైగా ఈ సినిమాను షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే యధావిధిగా మొదటి రోజే ఈ సినిమా పైరసీ లింక్స్ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యాయి. ఓ పక్కన నాలుగు రాష్ట్రాల్లో విడుదల కాకపోవడం, మరో పక్కన పైరసీ… ఇలా అన్నీ కూడా ‘పద్మావత్’కు ప్రతికూలంగా మారాయి.

ADVERTISEMENT

ప్రేక్షకులలో క్రేజ్ ఉన్న చిత్రాలను ఫేస్ బుక్ లో లైవ్ ఇవ్వడం ఇదే ప్రధమం కాకపోవచ్చు గానీ, ఇలా ప్రతి సినిమా కూడా లైవ్ లు ఇచ్చుకుంటూ వెళితే, సినీ పరిశ్రమ మనుగడ ఏంటన్నది మాత్రం ప్రశ్నార్ధకంగా మారుతోంది. దీనికి బాలీవుడ్ వర్గాలు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం విశేషం. బహుశా వీటిని నియత్రించడం తమ వల్ల కాదని డిసైడ్ అయిపోయారో ఏమో!?

ADVERTISEMENT
Latest Stories