ట్రైలర్ టాక్ – డైలాగ్స్ అదుర్స్… ఆడియన్స్ బెదుర్స్..!

Paisa Vasool Official Theatrical Trailerవన్ లైన్ పంచ్ లను అద్భుతంగా రాయగల పూరీ జగన్నాధ్ పెన్ను మరోసారి అదిరిపోయే డైలాగ్స్ ను “పైసా వసూల్” ద్వారా ప్రేక్షకులకు అందించబోతుందని ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది. నందమూరి నటసింహం బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ కు అభిమానులు మతి పోవాల్సిందే అనిపించే విధంగా స్పందన వస్తోంది.

‘మేరా నామ్ తేడా… తేడాసింగ్… దిమాగ్ తోడా… చాలా తేడా…’
‘దిస్ ఈజ్ మై విజిబుల్ రికార్డింగ్ వికీపీడియా’
‘గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడ్ని… మళ్ళీ టోర్నమెంట్లు పెట్టొద్దు…’
‘ఒన్స్ నా స్క్రూ లూజ్ అయితే… నేను ఇలాగే ఉంటా…’
‘బీహార్ నీళ్ళు తాగినోళ్లనే తీహార్ లో పోయించా… తూ క్యారె హోలే…’
‘నేనంతే… కసి తీరకపోతే… శవాన్ని లేపి మరీ చంపేస్తా…’

ADVERTISEMENT

ఇలా బాలయ్య పలికిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఇది నాణానికి ఒక వైపు. ఇంకో వైపు చూస్తే… ఈ డైలాగ్స్ తప్ప ఈ ట్రైలర్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. యాక్షన్ ఎంటర్టైనర్ అని ముందుగానే చెప్పారు గానీ, మరీ ఇంత యాక్షన్ ను తెలుగు ప్రేక్షకులు తట్టుకోగలరా? డైలాగ్స్ తప్పించి, బ్యాక్ గ్రౌండ్ సంగీతం గానీ, ఫోటోగ్రఫీ గానీ, హీరోయిన్ల లుక్స్ గానీ… ఏ విషయంలోనూ ఈ ట్రైలర్ సంతృప్తిని ఇవ్వదు. ఇక ట్రైలర్ కు ప్రాణమైన డైలాగ్స్ ను పలికిన బాలయ్య వాయిస్ వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండడం అసలు కొసమెరుపు.

సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు అంచనాలు బాగానే పెట్టుకున్నారు గానీ, అవి ఎంతవరకు సాకారం అవుతాయన్నది ప్రశ్నార్ధకమే. ధియేటిరికల్ ట్రైలర్ అయితే ఆ నమ్మకాన్ని ఏ మాత్రం ఇవ్వలేదని చెప్పవచ్చు. బహుశా ట్రైలర్ లో చూపించినట్లు… నాది నేల టికెట్ బ్యాచ్ అన్న బాలయ్య, ఆ వర్గాన్ని మాత్రం పూర్తిగా సంతృప్తి పరుస్తారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories