‘పంజా’ దర్శకుడి చేతిలో రామ్ చరణ్!

panja-director-vishnuvardhan-to-direct-ram-charanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “పంజా” చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తాజాగా మరో మెగా హీరోను లైన్ లో పెట్టారా? అంటే ఫిలింనగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘తనిఒరువన్’ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ చెర్రీని కలిసి ఓ కధ వినిపించినట్లుగా, దానికి చెర్రీ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. నిజానికి “మగధీర” చిత్రం తర్వాతే వీరిద్దరి కాంభినేషన్ సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. హీరోలను స్టైలిష్ గా చూపించడంలో విష్ణుది అందెవేసిన చేయి. మరి చెర్రీని ఏ విధంగా చూపిస్తారో?!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories