జగన్…సొంత బాబాయిని చంపినోడు…సొంత చెల్లిని గోడకేసి కొట్టినోడు…!

Pawan Kalyan Speech Today

ఎన్నికలేమో దగ్గర…అసలే వైసీపీ పాలన…దారంతా దాడులే….చేతిలో అధికారం లేదు….అయినా గుండెల నిండా ధైర్యం ఉంది…అంటూ జనసైనికులకు తన ఎన్నికల వ్యూహానికి గల కారణాలను వివరించారు పవన్.

జనసేన పార్టీకి సలహాలు , సూచనలు ఇచ్చేవారు అవసరం లేదు యుద్ధం చేసే యువ రక్తం జనసేనకు కావాలి. జగన్ లాంటి రాక్షుడుని ఓడించాలి అంటే యుద్ధమే చెయ్యాలి. సొంత బాబాయ్ వివేకాని చంపిన వ్యక్తి , సొంత చెల్లిని గోడకు కొట్టిన వ్యక్తి. అటువంటి వ్యక్తితో మనం రాజకీయ యుద్ధం చేయబోతున్నాం.

ADVERTISEMENT

అటువంటి వ్యక్తితో తలపడాలి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పార్టీతో పొత్తు అనివార్యం. జనసేన పార్టీ తరుపున ఎన్ని సీట్లు తీసుకోవాలో, పార్టీ తరుపున ఎక్కడ పోటీ చేయాలో నాకు ఎవరో చెప్పాల్సిన వసరం లేదు. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ప్రజల నాడికి అనుగుణంగానే నిర్ణయాలను తీసుకున్నాను.

జగన్ తన సొంత బాబాయ్ ని హత్య చేసినా అది గుండె పోటు అంటూ వెనకేసుకొచ్చే నాయకులు, మద్దతుదారులు ఆయన వెనుక ఉన్నారు. దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన జగన్ ను ప్రశ్నించడానికి ముందుకు రాని ఈ మేధావులు నన్ను ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నారా..? అంటూ పార్టీ సానుభూతి పరులుగా చెప్పుకుని పార్టీకి వెన్నుపోటు పొడిచేవారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

‘పవన్ తో స్నేహం అంటే పవన్ చచ్చేదాకా… పవన్ తో శత్రుత్వం అంటే అవతిలి వ్యక్తి చచ్చేదాకా’…అనేది గుర్తుపెట్టుకోండి. చెల్లిని గోడకుపెట్టి కొట్టేవాడిని ఏమంటారు. తల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు. దాస్తికుడు,సైకో అంటారు. ఆ సైకో ఎవరో మీకు తెలుసుగా…! అంటూ పవన్ తన స్టైల్ లో వాయించారు. ఈ సభతో ఇక వైసీపీ కి దబిడిదిబిడే అంటున్నారు జనసైనికులు.

Photos: TDP-Janasena Mega Meeting Highlights

ADVERTISEMENT
Latest Stories