మహేష్… పవన్… ఇద్దరూ రాజమౌళికి స్పెషలే..!

pawan kalyan and mahesh babu important to rajamoul సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే హంగామా తెలియనిది కాదు. అయితే అందుకు మన టాలీవుడ్ టాప్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. మహేష్ కేవలం తన సినిమాల విడుదల విషయంలో తప్ప, ఇతర సందర్భాలలో చాలా అరుదుగా మాత్రం స్పందిస్తుంటారు. ఇక పవన్ అయితే తన ‘జనసేన’ కార్యక్రమాల నిమిత్తం మాత్రమే ట్విట్టర్ ను వినియోగిస్తున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా ఫస్ట్ టైం ఒక సినిమాపై ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ స్పందించారు.

ADVERTISEMENT

అదే ఇండియన్ స్పెషల్ మూవీ..! ‘బాహుబలి 2’ 1000 కోట్లకు చేరుకున్న సందర్భంగా అంతగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతున్న శుభసందర్భాన… మన టాప్ హీరోలు కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్లు వేసారు. మహేష్ విడుదల సమయంలో చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పగా, తాజాగా 1000 కోట్లకు చేరుకున్న సందర్భంగా మరోసారి ట్వీట్ చేసారు. ఊహించడానికే సాధ్యం కానటువంటి 1000 కోట్లను అందుకుని, ఇంకా ఆగని ఈ కలెక్షన్ల ఒరవడిని ప్రస్తావిస్తూ… తెలుగు సినిమా ఖ్యాతిని సగర్వంగా చాటిచెప్పిన ‘రాజమౌళి అండ్ కో’కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక, అసలు స్పెషల్ ట్వీట్స్ పవన్ కళ్యాణ్ నుండి వచ్చాయి. బహుశా రాజమౌళి కూడా ఈ విషయం ఊహించి ఉండరేమో గానీ… 1000 కోట్ల మార్క్ ను అందుకున్నందుకు గానూ రాజమౌళి, ప్రభాస్ మరియు చిత్ర యూనిట్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ ఇలాంటివి సాధించడానికి కారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించారు పవన్. అలాగే రానాకు మరియు ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు పవన్.

సోషల్ మీడియా అంతా ఆదివారం నాడు ఇదే టాపిక్. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేసారు. అయితే రాజమౌళి మాత్రం ఈ ఇద్దరూ ట్వీట్లకే స్పందించారు. పవన్ చేసిన ట్వీట్ కు ‘థాంక్ యు వెరీ మచ్ సర్’ అంటూ స్పందించిన రాజమౌళి, ప్రిన్స్ విషయంలో మాత్రం కాస్త చొరవతో ‘థాంక్ యు మహేష్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో మహేష్, పవన్ ల ట్వీట్లు రాజమౌళికి కూడా స్పెషలే అన్న విషయం అర్ధమైంది. హీరోలు డామినేట్ చేసే ఇండస్ట్రీలో ఒక ‘డైరెక్టర్ బ్రాండ్’గా శిఖరాగ్ర స్థాయికి ఎదిగినా, తన ఔన్నత్యాన్ని మాత్రం రాజమౌళి ఎక్కడా కోల్పోలేదని ఈ సందర్భంగా చాటిచెప్పాడు.

ADVERTISEMENT
Latest Stories