పవర్ స్టార్ ఫ్యాన్స్ సత్తాకు నిదర్శనం!

pawan kalyan saptagiri express audio launchయూ ట్యూబ్ లో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సృష్టించడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సొంతం. పవన్ నటించిన సినిమా టీజర్ నుండి ట్రైలర్ వరకు తెగ హంగామా చేసే అభిమానులు, ఈ సారి పవన్ సినిమా కాకపోయినా సత్తా చాటారు. ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆడియో విడుదల అయిన “సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమా ట్రైలర్ 24 గంటల్లోనే 1 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడం ఊహించినది కాదు.

సప్తగిరి వంటి ఒక సాధారణ కమెడియన్ సినిమా ట్రైలర్ 10 లక్షల క్లిక్స్ ను ఒక్క రోజులో అందుకుందంటే అది సాధారణ విషయం కాదు. పవన్ స్టార్ సినిమా ట్రైలర్ ను చూసినంతగా ఈ సినిమా ట్రైలర్ ను అభిమానులు ఎగబడి చూసినట్లుగా అర్ధమవుతోంది. నిజానికి పవన్ నటించిన గత చిత్రం “సర్దార్ గబ్బర్ సింగ్” ట్రైలర్ కూడా ఒక్క రోజులో 1 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడంలో విఫలమైంది.

ADVERTISEMENT

ఈ తాజా పరిణామాలతో “సప్తగిరి ఎక్స్ ప్రెస్”పై ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అర్ధమవుతోంది. మరి ఈ అంచనాలను సప్తగిరి ఎంతవరకు అందుకుంటాడో గానీ, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఓపెనింగ్స్ విషయంలో ఏ మాత్రం డోకా లేదని పవన్ అభిమానులు పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారు. దీంతో కమర్షియల్ గా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ విజయాన్ని చవిచూడడం ఖాయంగానే కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories