“సర్ధార్” హిందీ వెర్షన్ పై అభిమానులు నిరాశ!

sardaar gabbar singh - baahubali‘బాహుబలి’ తర్వాత తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదలవుతోన్న ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాపై అభిమానులే కాదు, సినీ వర్గాలు కూడా తీవ్ర ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ‘బాహుబలి’ క్రెడిట్ మొత్తం దర్శకుడు రాజమౌళికి వెళ్ళడంతో హీరో సెంట్రిక్ సినిమాగా ‘సర్ధార్’ సత్తా ఎంత అన్న దానిపై ట్రేడ్ వర్గాలు విశ్లేషణలు చేస్తున్నాయి.

అంతటి ప్రాముఖ్యత గల హిందీ వెర్షన్ పై తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఓ ప్రకటన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. పవన్ సినిమా తొలిసారిగా బాలీవుడ్ లో విడుదల కానుండడంతో పవర్ స్టార్ చెప్పే హిందీ డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయో వినాలన్న ఆకాంక్షను పవన్ ఫ్యాన్స్ వ్యక్తపరిచారు. అయితే తాజాగా పవన్ దీనిపై ఓ స్పష్టత ఇచ్చారు. హిందీ వెర్షన్ కు డబ్బింగ్ తానూ చెప్పడం లేదని స్పష్టం చేయడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు.

ADVERTISEMENT

పవన్ సినిమాలలో హిందీ లిరిక్స్ తో కూడిన పాటలకు కొదవలేదు. దీంతో భాషలో పవన్ కు మాంచి పట్టు ఉందని భావించిన ఫ్యాన్స్ పవర్ స్టార్ పలికే హిందీ డైలాగ్స్ ను వినాలని భావించారు. కానీ డబ్బింగ్ చెప్పే సమయం లేదని తమ అభిమాన హీరో అనుకోని ట్విస్ట్ ఇవ్వడంతో కధ ముగిసింది.

ADVERTISEMENT
Latest Stories