అల్లు అర్జున్ ను రౌండప్ చేసిన పవన్ ఫ్యాన్స్!

pawan-kalyan-fans-attack-allu-arjun‘చెప్పను బ్రదర్’తో మొదలైన ‘బన్నీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్’ ఎపిసోడ్ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగిన ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ వేడుక ముగిసిన తర్వాత కూడా మరొకసారి బన్నీని రౌండప్ చేసారు పవన్ ఫ్యాన్స్. పవర్ స్టార్ ఊసెత్తకుండా జరిగిన చిరు వేడుకలో అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ ఫ్యాన్స్ కుర్చీలు విరగ్గొట్టి నిరసన తెలియజేయగా, మరొక వైపు స్టైలిష్ స్టార్ ను రౌండప్ చేసి తమ ప్రతాపం చూపించే పనిచేసారు.

బన్నీని చుట్టుముట్టిన పవన్ ఫ్యాన్స్… గట్టిగట్టిగా ‘పవర్ స్టార్ పవర్ స్టార్’ అంటూ నినాదాలు చేసి అల్లు అర్జున్ సహనాన్ని పరీక్షించారు. అయితే అభిమానులు ఎంత గట్టిగా అరిచినా నవ్వుతూ నిలబడ్డాడు తప్ప, పవన్ గురించి బన్నీ ఒక్క వ్యాఖ్య కూడా చేయకపోవడం విశేషం. పరోక్షంగా పవన్ గురించి ‘చెప్పను బ్రదర్’ అన్న విషయాన్ని మరోసారి చెప్పకనే చెప్పాడు బన్నీ. లేటుగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ADVERTISEMENT

చూడబోతుంటే… ‘బన్నీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్’ ఎపిసోడ్ కు ఇప్పట్లో శుభంకార్డు పడేలా కనపడడం లేదు. బన్నీ పాల్గొనే ఏ మెగా ఈవెంట్ లోనైనా పవన్ ఫ్యాన్స్ ఇలాగే సందడి చేస్తున్నారు. అలాగే మరో వైపు పవన్ సైతం తన అభిమానులకు సూచనలు గానీ, సలహాలు గానీ ఇచ్చే కార్యక్రమం కూడా చేయకపోవడంతో, ఈ ‘వార్’ ఇలాగే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories