హెలికాఫ్టర్ ను చేజ్ చేసిన ‘జనసేన’ అధినేత!

pawan-kalyan-helicopter-journey-viral-in-social-media‘పంజా’ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఫీట్లు గుర్తున్నాయా? హెలికాఫ్టర్ నుండి దూకి సిల్వర్ స్క్రీన్ పై పవన్ చేసిన బీభత్సాన్ని బహుశా మరెవరూ మరిచిపోలేరేమో! రీల్ లైఫ్ పరిస్థితి అలా ఉంటే, రియల్ లైఫ్ లో కూడా పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్ ను చేజ్ చేసిన వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది.

[m9ad]

ADVERTISEMENT

ఎప్పటిదో తెలియదు గానీ… టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న హెలికాఫ్టర్ ను పరిగెత్తుకుంటూ జనసేన అధినేత వెళ్ళిన వీడియో సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పవన్ కంటి ఆపరేషన్ చేయించుకుని కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు గనుక, ఖచ్చితంగా ఇప్పటి వీడియో అయితే కాదని చెప్పవచ్చు గానీ, ఎప్పటిదో మాత్రం తెలియరాలేదు.

వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచించుకుంటున్న జనసేన అధినేత ఎంతవరకు విజయవంతం అవుతారో గానీ, అభిమానులు మాత్రం ఈ హెలికాఫ్టర్ మాదిరి టేకాఫ్ కు సిద్ధంగా ఉన్నారు. ఇక పరుగులు పెట్టించాల్సిన, పెట్టాల్సిన వంతు పవన్ కళ్యాణ్ దే!

ADVERTISEMENT
Latest Stories