Watch: సాక్షిని అనుసరిస్తోన్న జనసేన ఛానల్!

Pawan Kalyan Jana Sena 99 News Channel follows sakshiతమకంటూ ఓ మీడియా ఉండాలని భావించిన జనసేన, ఇటీవల 99 ఛానల్ ను సొంతం చేసుకున్న విషయం బహిరంగమే. ఈ ఛానల్ మైక్ పట్టుకుని, ఇది మనదేనా? బాగుంది! అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సరే ఇంతకీ ఈ మీడియాలో కధనాలు ఎలా ప్రసారం అవుతున్నాయి? అంటే జగన్ మీడియా అయిన సాక్షికి పార్ట్ 2 అన్న టాక్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.

ఏ అంశం లేవనెత్తినా, ఇది జగన్ ముందే చెప్పాడు అంటూ సాక్షి మీడియా ఎలా అయితే కధనాలు ప్రసారం చేస్తుందో, పవన్ మీడియా కూడా అదే పంథాను అనుసరిస్తోంది. ఎంతగా అంటే… ఇటీవల పార్లమెంట్ సమావేశాలలో టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు హిందీలో మాట్లాడడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడట. ఏంటి… తట్టుకోలేనంత నవ్వు వస్తుందా..? తప్పులేదు నవ్వుకోండి… కానీ సదరు మీడియా ఛానల్ మాత్రం అలాగే చెప్పింది.

ADVERTISEMENT

మన ఎంపీలకు హిందీ రాదని ఎప్పుడో పవన్ కళ్యాణ్ అన్న మాటను టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు సీరియస్ గా తీసుకుని, మొన్న ముగిసిన సమావేశాలలో హిందీలో దంచి కొట్టారట. నవ్వించడానికి కూడా హద్దులు పెడితే, బహుశా ఇలాంటి ప్రసారాలకు అడ్డుకట్ట పడుతుందేమో! ఇంకా నయం… గల్లా జయదేవ్ ఇంగ్లీష్ మాట్లాడడం వెనుక కూడా పవన్ కళ్యాణే ఉన్నారని చెప్పలేదు..! ఏముందిలెండి… చెప్తే ఇంకాసేపు నవ్వుకోవచ్చు..!

ADVERTISEMENT
Latest Stories