ఇందులో కొత్తగా ఏముంది పవన్?

Mega-Fans-Meet--Pawan-Kalyan-Jana-Senaమెగా అభిమానులతో కలిసి ఆత్మీయ సదస్సు పేరిట హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది జనసేన పార్టీ. మెగా ఫ్యామిలీ హీరోలు, కుటుంబ సభ్యులు కూడా పవన్ వెనుక ఉంటారని తేలడంతో, అభిమానులను కూడా ఒక్క తాటిపైకి తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగానే మెగా ఫ్యాన్స్ తో కలిసి వేదికను పంచుకున్న పవర్ స్టార్, తన అన్నయ్య మీద ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకుని, చిరు ఫ్యాన్స్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసారు.

జనసేన పార్టీ మరెవరిదో కాదు, చిరంజీవి గారి అభిమానులలో ఒకరిది అంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తూ ప్రారంభమైన పవన్ ప్రసంగం ఆద్యంతం, చిరుపై పొగడ్తలు కురిపించారు. అనుభవం లేకుండా పదవులు వద్దనుకున్నాను, ఇప్పుడు అనుభవం వచ్చింది కాబట్టి రేసులో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు పవన్. తన విధివిధానాలు కొత్తగా అనిపించొచ్చు, కొత్త రాజకీయ వ్యవస్థ వచ్చే ముందు ఇలాగే అర్ధం కానట్లుగా ఉంటుందని వ్యాఖ్యానించారు పవర్ స్టార్.

ADVERTISEMENT

అయితే రాజకీయాలలో పవన్ కొత్తగా ఏం చేస్తున్నారు? అని ఆలోచించడం వీక్షకుల వంతవుతోంది. ఇప్పటివరకు తెలుగుదేశం, వైసీపీలు ఏ విధంగా అయితే కుల రాజకీయాలు ప్రోత్సహించాయో, అదే విధంగా జనసేన కూడా సాగుతోంది. అలాగే అధికారం కోసం అర్ధం పర్ధం లేని ఆరోపణలు ఎలా అయితే వర్తమాన రాజకీయాలలో ప్రస్తుత నేతలు చేస్తున్నారో, పవన్ కూడా అదే విధివిధానాలను పాటిస్తున్నారు. మరి పవర్ స్టార్ కొత్తగా ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. బహుశా కొత్తగా చేస్తానని చెప్పడమే కొత్త అనుకుంటే, ఇప్పటికే దానిని ప్రజారాజ్యం అధినేత కూడా వినియోగించేసారు కదా!?

ADVERTISEMENT
Latest Stories