ఇవేమి పనులు పవన్ కళ్యాణ్…. ఇవేనా బాధ్యతాయుతమైన రాజకీయాలు?

Will-Pawan-Kalyan-Repeat-Chiranjeevi-Mistakeజనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోట మరోసారి ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమ ఊసు వచ్చింది. రాజకీయ పెత్తందారులు ఉత్తరాంధ్రలోని రాజకీయాలను శాసిస్తూ అక్కడి ప్రజలను పేదరికంలోనే ఉంచుతున్నారని దీని వల్ల అక్కడి ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, అలానే వదిలేస్తే తెలంగాణ ఉద్యమం వంటి మరో ఉద్యమం రావడం ఖాయమని హెచ్చరించారు.

దీనికి సంబంధించి ఆయన విశాఖలో కొందరి మేధావులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారట. అయితే పవన్ కళ్యాణ్ చేష్టల పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి కోనసీమలో కూడా కొంత మంది ప్రత్యేక రాష్ట్రం అంటూ అప్పుడప్పుడూ మాట్లాడటం మనం చూస్తూనే ఉంటాం. నిజానికి రాష్ట్రానికి చెందిన ప్రతి జిల్లాకు ఏదో ఒక అసంతృప్తి ఉండటం సహజమే.

ADVERTISEMENT

అటువంటి వారికి నాయకత్వం వహించేవాళ్ళు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే ఉద్యమంగా రూపుదిద్దుకోవచ్చు. తెలిసో తేలికో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ కు కొన్ని సహజ వానరాలు ఉన్నా రాష్ట్రవిభజన తరువాత చాలా ఇబ్బందులు పడుతుంది. ప్రత్యేక ఉత్తరాంధ్ర అంటే అసలు ఊహించుకోవడమే కష్టం.

ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ వంటి వారు రాజకీయ లబ్ది కోసం చేసే ఇటువంటి పనుల వల్ల రాష్ట్రానికి పెను ముప్పు ఖాయం. ఇటువంటి ఉద్యమాలను, ఆలోచనలు మొగ్గ లోనే తుంచేయడం ఎంతైనా మేలు. ఇప్పటికే ప్రత్యేక రాయలసీమ అంటూ కొందరు ఆ ప్రయత్నాలలో ఉన్నారు. ఎంతో బాధ్యతాయుతంగా రాజకీయాలు చేస్తా అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇటువంటి పనులు చెయ్యడం బాధాకరం.

ADVERTISEMENT
Latest Stories