జగన్ కు పవన్ మద్దతు… ఇప్పుడేం జరగబోతుంది?

Pawan- Kalyan - JanaSena -YS jagan - YSRCPజనసేన అధినేత పవన్ కల్యాణ్ వైకాపాతో కలిసేందుకు సుముఖంగా ఉన్నారని తిరుపతి తాజా మాజీ ఎంపీ వరప్రసాద్ బయటపెట్టారు. ఆయన రాజీనామా ఆమోదించడంతో తొలిసారిగా తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి నచ్చకపోవడంతో పవన్ 2019లో జగన్ తో కలిసి నడవడానికి సిద్ధపడ్డారని తెలిపారు.

ADVERTISEMENT

ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిలో కన్నా అవినీతిలోనే ముందంజలో ఉన్నారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడుతూ జగన్ ను కష్టజీవిగా అభివర్ణించారని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవలే చంద్రబాబుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గట్టిగా గళం ఎత్తడంతో ఇది నిజమనే అనుమానం రాకమానదు.

అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ జగన్ కలిసితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒక చోట చేరి భారీ విజయం చేకూరుతుందని కొందరు వాదిస్తుండగా. ఒక పథకం ప్రకారమే అందరూ కలిసి చంద్రబాబుని ఇరుకున పెడుతున్నారని ప్రజలకు అర్ధమయ్యి చంద్రబాబుపై సానుభూతితో టీడీపీ వైపు మొగ్గుతారని కొందరి అంచనా.

మరోవైపు ఇరుపక్షాలు 2014 ఎన్నికల సమయంలో ఒకరినొకరు గట్టిగా విమర్సించుకున్నారు. దీనితో ఒకరినొకరు ఆ పొత్తును ఎలా సమర్ధించుకుంటారో చూడాలి. పొత్తు అనేది ఉంటే అసలు జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారో అనేది కూడా చూడాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories