జనసేన తెలంగాణ వ్యూహం… బలం ఉన్న చోట పోటీ.. మిగతా చోట్ల ప్రభావితం

Pawan-Kalyan- Janasena-to-contest in telanganaతెలంగాణలో కూడా జనసేన పోటీచేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ అంటే తనకు పిచ్చి ప్రేమ అని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీకి బలం ఉన్న చోట పోటీ చేస్తామని, మిగతా చోట్ల ప్రభావితం చేస్తామని ఆయన చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్ని చోట్లా పోటీ చెయ్యబోతున్నట్టు సమాచారం.

[m9ad]

ADVERTISEMENT

జనసేన తెరాసతో పొత్తు కోసం రాయభారం చేసినా కేసీఆర్ అందుకు సుముఖంగా లేరని సమాచారం. దీనితో రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకోబోతున్నట్టు సమాచారం. దాని ప్రకారం జీహెచ్ ఎంసీ, ఖమ్మం మరియు కొన్ని ఆంధ్ర ప్రభావిత చోట్ల జనసేన పోటీ చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలకు పడే అవకాశం ఉన్న ఓట్లను చీల్చి తెరాసకు మేలు చేస్తుంది.

తెలంగాణ అంటే తనకు పిచ్చి ప్రేమ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. జనసేన మానిషెస్టోలో తెలంగాణ అంశాలు కూడా చేరుస్తారమని ఆయన అన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తునట్టు తెలంగాణాలో కూడా విస్తృతంగా పర్యటిస్తారో లేదో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories