ఫస్ట్ రవితేజ… సెకండ్ అల్లు అర్జున్..!

Double-Dose-For-Powerstar-Pawan-Kalyan-Fansఈ గురువారం నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉండనున్నారు, రాజకీయంగా కాదండోయ్! సినీ వేడుకలతో..! యధావిధిగా పుస్తకాలపై పసలేని ట్వీట్లు చేసుకుంటూ తనదైన రాజకీయం చేస్తున్నానని భావిస్తున్న ‘జనసేన’ అధినేత, ఈ గురువారం నాడు రెండు సినీ వేడుకలకు హాజరు కాబోతున్నారు.

అందులో మొదటిది… రవితేజ హీరోగా నటిస్తున్న ‘నేలటికెట్టు’ ఆడియో వేడుక. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రానున్నారన్న విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. రెండు వేడుకలలో ముందుగా ఈ వేదికకే పవన్ హాజరు కానున్నారు.

ADVERTISEMENT

ఇక రెండవది… అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “నా పేరు సూర్య” సక్సెస్ మీట్ లో తళుక్కుమననున్నారు. ఇటీవల ‘రంగస్థలం’ సక్సెస్ వేడుకల్లో కూడా భాగస్వామి అయిన పవన్, తాజాగా బన్నీ వేడుకకు విచ్చేయడం ద్వారా మెగా అభిమానులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం అనేది ‘జనసేన’కు కూడా అవసరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ADVERTISEMENT
Latest Stories