ఏడో తరగతిలో పవన్ ఇలా..!

Pawan Kalyan old photo with chiranjeevi naga babuజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ తన చిన్ననాటి ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో తన సోదరీమణులతో పాటు, సోదరులు మెగాస్టార్‌ చిరంజీవి, నిర్మాత, నటుడు నాగబాబు కూడా ఉన్నారు. ఆ ఫోటో దిగిన కాలంలో తాను ఏడో తరగతి చదువుతున్నానని పవన్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT

తాను శ్వాసకోశ సంబంధిత వ్యాధి నుంచి అప్పుడే కోలుకున్నానని తెలిపారు. పవన్‌ పోస్ట్ చేసిన ఈ చిన్ననాటి ఫోటో వైరల్‌ అయ్యింది. తమ అభిమాన హీరో చిన్నతనం ఫోటోను చూస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు.

తాను నటుడిని అవ్వాలని అనుకోలేదని, కానీ అయ్యానని, చాలా తక్కువ సినిమాలు చేసినా భగవంతుడి కృప వల్ల 100 సినిమాలు చేసిన ఇమేజ్‌ వచ్చిందని, ఏమీలేని స్థాయి నుంచి 25 కోట్లు పన్నులు కట్టే స్థాయికి వచ్చానని అన్నారు. తనకు డబ్బు అవసరం లేదని, సమతుల్యత, శాంతి కావాలని అన్నారు. అందుకే తాను ‘అజ్ఞాతవాసి’ సినిమా ఫెయిల్‌ అయినా తిరిగి డబ్బులు ఇచ్చేశానని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories