చంద్రబాబు నాయుడు అరెస్ట్‌: పవన్‌ ఏమన్నారంటే…

Pawan Kalyanమాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ని ప్రతిపక్ష నేతలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సీపీఐ సీనియర్ నేత నారాయణ దీనిపై స్పందిస్తూ, జగన్‌ రెడ్డి పాలనలో రెండే రెండు ప్రధానంగా కనిపిస్తాయి. 1 రివర్స్ టెండరింగ్, 2. రివెంజ్ పాలిటిక్స్. రివర్స్ టెండరింగ్‌ రాష్ట్రాభివృద్ధికి ఎప్పుడో బ్రేకులు వేసేశారు.

ADVERTISEMENT

అధికారంలో వచ్చినప్పటి నుంచి రివెంజ్ పాలిటిక్స్‌తో టిడిపి నేతలను, కార్యకర్తలను వేధిస్తూనే ఉన్నారు. జగన్‌ రివెంజ్ పాలిటిక్స్‌కి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ పరాకాష్ట. ఆయన అరెస్ట్‌ చేయడానికి ఎటువంటి కారణమూ చూపలేదు. అడిగితే ఆయనను అరెస్ట్‌ చేసి విజయవాడ తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తామంటున్నారు.

ఓ మాజీ ముఖ్యమంత్రిని ఎటువంటి కారణమూ చూపకుండా అరెస్ట్‌ చేసి తీసుకువెళ్ళడం చూస్తే ఇంత బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో?అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యగానే మేము భావిస్తున్నాము. దీనిని మేము ఖండిస్తున్నాము. ఇది రివర్స్ కొడితే జగన్‌ పని అయిపోతుంది,” అని అన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తూ, “ప్రాధమిక ఆధారాలు చూపించకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేయడాన్ని జనసేన ఖండిస్తోంది. గతంలో నేను వైజాగ్‌ పర్యటించినప్పుడు, చంద్రబాబు నాయుడు చిత్తూరు, అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం రాజకీయకక్ష సాధింపు చర్యలకు పాల్పడింది.

అసలు ఈ కేసుతో వైసీపీ నేతలకు ఏమిటి సంబంధం? అందరూ మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పోలీసులదా లేక వైసీపీ నాయకులదా?వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలకైనా పాల్పడవచ్చు. ఎంత అవినీతి అయినా చేయొచ్చు. విదేశాలకు కూడా వెళ్ళి రావచ్చు. కానీ తమ నాయకుడు అరెస్ట్‌ అయితే టిడిపి నేతలు, కార్యకర్తలు పరామర్శించడానికి రాకూడదా?ఇదెక్కడి న్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలను, కార్యకర్తలను అరెస్ట్‌ చేయిస్తున్నారు? గృహనిర్బందం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తిని ఎటువంటి కారణాలు చూపకుండా అర్దరాత్రి అరెస్ట్‌ చేయాలనుకోవడం ఖచ్చితంగా రాజకీయకక్ష సాధింపు చర్యే. చంద్రబాబు నాయుడు అరెస్టును మేము ఖండిస్తున్నాము,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ “జ‌గ‌న్ రెడ్డి త‌న తాత రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లుని తీవ్రం చేశాడు. టిడిపి అధినేత చంద్ర‌బాబుని చ‌ట్టాల్ని ఉల్లంఘించి మ‌రీ అక్ర‌మ అరెస్టు చేయించ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీచేసి ప్ర‌తిప‌క్ష నేత‌ని త‌ప్పుడు మార్గంలో అరెస్టు చేయించిన వైకాపా ప‌త‌నం ఖాయం,” అని ట్వీట్‌ చేశారు.

ADVERTISEMENT
Latest Stories