‘వర్మ’ను ఎక్కడ ‘టచ్’ చేయకూడదో అక్కడే కెలికిన ‘పవన్’

Pawan Kalyan Responds on Ram Gopal Varma Tweetsఇప్పటివరకు ‘జనసేన’ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అనేక సందర్భాలలో అనేక విధాలుగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ ను పొగుడుతూ ఆకాశానికేత్తేసిన సందర్భాలు ఉన్నాయి… అలాగే పాతాళంలోకి దించేసిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇలా ఎన్ని సార్లు తన గురించి ప్రస్తావించినా, పవన్ మాత్రం వర్మ గురించి మాట్లాడింది లేదు. కానీ, నేడు జరిగిన ప్రెస్ మీట్ లో వర్మ గురించి పవన్ ఒక్క మాటలో తేల్చేసాడు.

ADVERTISEMENT

అది కూడా వర్మను ఏ విషయంలో అయితే కెలకకూడదో, అదే దాంట్లో పవన్ వేలెత్తి చూపించడంతో వర్మ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ‘ఆయనకు 50 ఏళ్ళకు పైనే ఉంటాయి, ఒక పెళ్ళైన కూతురు ఉంది, అయినా ఇప్పటికీ పోర్న్ సినిమాలు చూస్తాను’ అని చెప్పిన వ్యక్తి గురించి నేనేమీ మాట్లాడేది అని పవన్ తేల్చేసారు. బహుశా ఇదే విధానం మెగా కాంపౌండ్ కు రాక, ఇటీవల వర్మపై స్పందించి రచ్చ రచ్చ చేసుకున్నారు. ఏది ఏమైనా పవన్ స్టైల్ వేరు కదా! ఒక్క డైలాగ్ తో వర్మకు దిమ్మతిరిగే కౌంటర్ వేసారని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అయితే ఏ విషయంలో తనను విమర్శించినా, వర్మ సహిస్తారు గానీ, పోర్న్ వీడియోల విషయంలో మాత్రం వర్మ తీరు వేరని, గతంలో ఆయన ఇంటర్వ్యూలే చెప్తాయి. ‘చాలా మంది పోర్న్ వీడియోలు చూస్తారు, నేను చెప్తాను, వాళ్ళు చెప్పరు, అంతే తేడా’ అంటూ పోర్న్ గురించి బహిరంగంగా చెప్పడం అప్పట్లో సంచలనాత్మకమైంది. అలాగే చాలా సందర్భాలలో కూడా సెక్స్ వీడియోల గురించి వర్మ ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో వర్మ నుండి పవన్ పైకి ఎలాంటి బాణాలు వస్తాయో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories