కొత్త టీజర్లు, పోస్టర్స్ తో ‘సర్ధార్’ హంగామా షురూ!

Pawan kalyan Sardaar Gabbar Singh latest posterఏప్రిల్ 8వ తేదీన విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా హంగామా ప్రారంభమైంది. సరికొత్త పోస్టర్లు, అలాగే ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే టీజర్లతో ప్రచారం ఊపందుకుంది. ధియేటర్ల వద్ద ముద్రించిన పోస్టర్లు చూసి ఫ్యాన్స్ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పంచె కట్టుకుని బుల్లెట్ పై వెళ్తున్న పోస్టర్ ‘కిర్రాక్’గా ఉండడంతో, ఈ పోస్టర్ ను ఫోటోలు తీసి మరీ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

అలాగే ఇంకా వెబ్ మీడియాకు విడుదల చేయని కొన్ని కొత్త టీజర్లు బుల్లితెరపై సందడి చేస్తున్నాయి. ‘గబ్బర్ సింగ్… గబ్బర్ సింగ్… కౌన్ హై…’ అంటూ ‘విక్రమార్కుడు’ విలన్ చెప్పిన డైలాగ్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన పవన్ ఓ పంచ్ ను పేల్చారు. ‘ప్రతి కౌంటర్ కు ఒక మీనింగ్ ఉంటుంది, చేసే ప్రతి ఎన్ కౌంటర్ కు ఓ టైమింగ్ ఉంటుంది’ అంటూ పవన్ చేసిన రచ్చ మామూలుగా లేదు. స్కిప్పింగ్ లు ఆడడం దగ్గర నుండి చిన్నపిల్లలు చేసే ప్రతి చేష్టలతో పవన్ ఫ్యాన్స్ కు ఓ రకంగా పిచ్చేక్కిస్తున్నాడు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories