విడుదల సమయం దగ్గరవుతున్న కొద్ది పవర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు చేయడానికి ‘సర్ధార్’ చిత్ర యూనిట్ వరుసగా వీడియోలను విడుదల చేస్తోంది. ఆ క్రమంలో ‘సర్ధార్ గబ్బగ్ సింగ్’ రెండవ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న పవన్ ఫ్యాన్స్ కు కిర్రాక్ అనిపించేలా ఈ వీడియో ఉండడంతో ఇక తమ పంట పండినట్లేనని ధృవీకరించుకుంటున్నారు.
‘సర్ధార్’ సెట్ ను వీక్షించడానికి చిరంజీవి ప్రత్యేకంగా ఎందుకు విచ్చేసారో అన్న విషయాన్ని ఈ వీడియోలో స్పష్టం చేసారు. నిజంగానే ఈ సెట్ అద్భుతంగా కనపడుతోంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి విలువ వెండితెరపై ఖచ్చితంగా కనపడేలా సెట్ దర్శనమిచ్చింది. ఇక, పవన్ స్టిల్స్ గురించి చెప్పేదేముంది. ఈ వీడియోలో పవన్ ఉన్న ప్రతి షాట్ ను స్క్రీన్ షాట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ చూసుకునే విధంగా పవన్ రూపం ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉంది. ఇప్పటికే టికెట్ల కోసం అభిమానులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుండగా, ఈ వీడియో వారికి మరింత ఊపునిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.



