“సర్ధార్” టాక్ – తప్పు తప్పే… పెద్ద తప్పే..!

sardaar gabbar singh utter flopకమర్షియల్ అంశాలను దూరంగా పెట్టి ‘జానీ’ సినిమాకు కధను సమకూర్చిన పవర్ స్టార్ ఆ చిత్ర ఫలితాన్ని మళ్ళీ రిపీట్ కాకూడదని, ఈ సారి పూర్తి కమర్షియల్ అంశాలతో “సర్ధార్ గబ్బర్ సింగ్” ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే పవన్ ఎంచుకున్న కమర్షియల్ అంశాలను సినీ ప్రేక్షకులు ఇప్పటికే కొన్ని వందల సార్లు, అది కాదంటే వేల సంఖ్యలో వీక్షించడమే ‘సర్ధార్’ సినిమాకు ‘మైనస్’గా మారింది.

ADVERTISEMENT

నిజానికి ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత సగటు సినీ అభిమానికి ఏర్పడిన అభిప్రాయాన్ని ‘సర్ధార్’ సినిమా ఏ మాత్రం మార్చలేకపోయిందనే టాక్ వెలువడుతోంది. ఏప్రిల్ 8వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో విడుదల కావాలని అన్నీ తానై పవన్ కష్టపడ్డారు గానీ, దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం ఆశాజనకంగా లేకపోవడం అభిమానులను నిరుత్సాహ పరుస్తోంది. ‘వన్ మ్యాన్ షో’తో పవన్ నెట్టుకొచ్చినప్పటికీ, అది సఫలీకృతం అయ్యేటంత కాదన్న విశ్లేషకుల వ్యాఖ్యలతో ‘ఉగాది’ పండుగ నాడు పవన్ ఫ్యాన్స్ కు ‘చేదు’ రుచి తగులుతోంది.

ముందుగా అంచనా వేసినట్లే… 7వ తేదీ అర్దరాత్రి వేసిన బెనిఫిట్ షోల ఫలితాలు సోషల్ మీడియా వేదికగా ‘సర్ధార్’ టాక్ ను ప్రచారం చేసాయి. దీంతో బెనిఫిట్ షోలు ‘సర్ధార్’ సినిమాకు మైనస్ గా మారాయి. అప్పటివరకు పక్కా ‘బ్లాక్ బస్టర్’ అని అభిమానులు వేసిన అంచనాలలో ‘తప్పు తప్పే… పెద్ద తప్పే…’ జరిగిందని సినీ విశ్లేషకులు తేల్చేసారు.

అయితే కలెక్షన్స్ విషయానికి వస్తే… ఓవర్సీస్ ప్రీమియర్స్ లో గత రికార్డులు బద్దలు కాకపోయినప్పటికీ పర్వాలేదనిపించే స్థాయిలోనే కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఏపీ, తెలంగాణాలలో మొదటి మూడు రోజులు సెలవు దినాలు కావడంతో కలెక్షన్స్ కు పెద్దగా డోకా ఉండకపోవచ్చు. అయితే ‘బాహుబలి’ రేంజ్ లో ‘సర్ధార్’ కలెక్షన్స్ ను ఆశించడం మాత్రం అత్యాశే అవుతుందన్న టాక్ కు రానూ రానూ బలం చేకూరుతోంది.

ADVERTISEMENT
Latest Stories