మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న సినిమాకు హల్చల్ చేసినన్ని టైటిల్స్ ఈ మధ్య కాలంలో మరే సినిమాకు వినిపించలేదు. ఇంకా చెప్పాలంటే ప్రిన్స్ కెరీర్ లోనే ఇన్ని టైటిల్స్ సందడి చేయలేదు. అయితే ఫైనల్ గా “స్పైడర్” టైటిల్ తో జూన్ 23వ తేదీన రాబోతున్న విషయం ఇటీవల స్పష్టత ఇచ్చి, అభిమానులకు ఓ తీపికబురును అందించారు. అయితే మహేష్ సినిమా బాటలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా కూడా పయనిస్తోందా? అంటే అవుననే సమాధానమే లభిస్తోంది.
ఇప్పటివరకు ఈ సినిమాకు రెండు టైటిల్స్ ప్రధానంగా వినిపించాయి. అందులో మొదటిది “దేవుడే దిగివస్తే” కాగా, రెండవది “ఇంజినీర్ బాబు.” మొదటి టైటిల్ అభిమానులను ఊర్రూతలూగించే విధంగా ఉండగా, రెండవది యువతకు కిక్ ఎక్కించే విధంగా ఉంది. అయితే ఈ రెండు టైటిల్స్ కాదని, ఇంకా టైటిల్ నిర్ణయమే జరగలేదని, ఇటీవల యూనిట్ సభ్యుల ద్వారా ఓ క్లారిటీ వచ్చింది. కానీ, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో టైటిల్ హాట్ హాట్ గా వినపడుతోంది.
ఇప్పటివరకు త్రివిక్రమ్ – పవన్ కాంభినేషన్ లో వచ్చిన ‘జల్సా, అత్తారింటికి దారేది’ టైటిల్స్ కాస్త వినూత్నంగా ఉండడంతో పాటు కధలోని కంటెంట్ కు తగిన విధంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. అలాగే తాజాగా కూడా కధకు తగినట్లే “పరదేశ ప్రయాణం” టైటిల్ తో రావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ టైటిల్ అయితేనే స్టోరీకి తగిన విధంగా ఉంటుందని చర్చించుకుంటున్నారట. డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉన్న ఇది పవన్ కున్న మాస్ ఫ్యాన్స్ కు పెద్దగా కిక్ ఎక్కించదు. అయితే… పవన్ సినిమాకు టైటిల్ తో సంబంధమేముందిలేండి..!



