దాదాపుగా నాలుగేళ్ల నుండి ట్విట్టర్ ఖాతాను వినియోగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో 3 మిలియన్స్ కు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ ట్విట్టర్ ఖాతాను రాజకీయ అభిప్రాయాలను తెలియజెప్పే సామాజిక మాధ్యమంగా తప్ప, ఏ ఇతర ప్రయోజనాల కోసం వినియోగించలేదు. ఇప్పటివరకు ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేసిన భావాలన్నీ పొలిటికల్ యాంగిల్ కు మాత్రమే పరిమితం! పండగల నాడు శుభాకాంక్షలు చెప్పడం అనేది కూడా రాజకీయ నాయకుల ప్రక్రియలో ఓ భాగం అన్నది తెలిసిందే.
అయితే తొలిసారిగా తన ట్విట్టర్ ఖాతా నుండి నాన్ పొలిటికల్ ట్వీట్ వేసారు పవన్. అది కూడా తన మాజీ సతీమణి రేణుదేశాయ్ గురించి కావడం మరో విశేషం. ఇటీవలే నిశ్చితార్ధం జరుపుకున్న రేణుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఫేస్ లోకి ఎంటర్ అవుతున్న జీవితం ఆనందమయంగా ఉండాలని, ఆరోగ్యం, ప్రశాంతత, ఆదాయం సమకూరాలని ప్రార్ధిస్తానని పవన్ ట్వీట్ చేయడం అనేది ఊహించినది కాదు. రేణు విషయంలో అభిమానులు స్పందిస్తున్న తీరును మార్చడానికి ఈ ట్వీట్ వేసినట్లుగా అర్ధం చేసుకోవచ్చు
My wholehearted wishes to Ms.Renu garu for entering a new phase of happiness.I wish and pray Almighty & the Mother Nature to bestow upon her abundant health, peace and prosperity.
— Pawan Kalyan (@PawanKalyan) June 26, 2018



