టీజర్ టాక్ – మళ్ళీ నరేష్ హైలైట్!

Pedavi Datani Matokatundhi Dialogue Teaserప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తోన్న నరేష్ సిల్వర్ స్క్రీన్ ను దున్నేస్తోన్న విషయం ఇటీవల విడుదలైన “సమ్మోహనం” సినిమా ద్వారా మరోసారి నిరూపణ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న నరేష్, సెంటిమెంట్ తో పాటు వినోదాన్ని బాగా పండిస్తున్నారు. మళ్ళీ అలాంటి క్యారెక్టరే “పెదవి దాటని మాటకోటుంది” సినిమా ద్వారా పడినట్లుగా ఈ టీజర్ చెప్తోంది.

కొత్త హీరోహీరోయిన్లతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లో… ప్రేమ గురించి, అమ్మాయిల గురించి హీరో చెప్పే సన్నివేశాల తర్వాత, ‘ఒరేయ్ ఊరకుక్క, ఈ నాలెడ్జ్ ఏదో దేనికైనా వాడి ఉంటే ఎప్పుడో ముందుకు పోయేవాడివి’ అన్న డైలాగ్స్ వినోదాన్ని పండించాయి. ‘సమ్మోహనం’ ద్వారా హిట్ అందుకున్న ఘట్టమనేని కాంపౌండ్ హీరో సుధీర్ బాబు ఈ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories