సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ హీరోగా రూపుదిద్దుకుంటున్న “పెన్సిల్” సినిమా ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సింపుల్ సస్పెన్స్ కధాంశంతో ‘పెన్సిల్’ ట్రైలర్ వీక్షకులను అలరిస్తోంది. స్కూల్ లో జరిగిన ఒక సంఘటన ఎక్కడికి దారి తీసింది అనేది చిత్ర కధ.
ఆద్యంతం ఆసక్తి కలిగించే ట్రైలర్ లో కధనంకు తోడు జివి ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం సినిమా సస్పెన్స్ ను కొనసాగించే విధంగా ఉంది. మణి నాగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ముద్దుగుమ్మ శ్రీదివ్య నటించింది. ప్రముఖ పెద్ద సినిమాలన్నింటిని పంపిణీ చేస్తున్న ఈరోస్ సంస్థ ఈ చిన్న చిత్రాన్ని కూడా పంపిణీ చేయడం విశేషం. ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందనే పాజిటివ్ సంకేతాలను ట్రైలర్ అయితే ఇవ్వగలిగింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



