ఇంతటి అవమానమా? కూల్చివేతల ప్రభుత్వాన్నే కూలుస్తారా?

Perni nani sensational commentsబీజేపీ పై మంత్రి పేర్ని నాని ఉన్నఫళంగా సంచలన ఆరోపణ చేశారు. త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని… కాషాయ కండువా కప్పుకున్న బాబా ని తెచ్చి సీఎంని చెయ్యాలని బీజేపీ ఆశ పడుతుందని ఆయ‌న అన్నారు.

ADVERTISEMENT

టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యే పార్టీలుగా ఆరోపించారు. గతంలో మోదీని తిట్టి ఇప్పుడు ప్రేమ లేఖలు రాస్తున్నారని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఈ ఆరోపణనలను బీజేపీ నాయకులు సహజంగానే ఖండిస్తున్నారు. అయితే అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అని సర్వత్రా చర్చ జరుగుతుంది.

పైగా ఈ వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవి కాదు.. రాష్ట్ర కేబినెట్ సమావేశం పూర్తి అయ్యాక కేబినెట్ నిర్ణయాలు మీడియాకు తెలుపుతూ నాని ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ముఖ్యమంత్రి అనుమతితోనే చేసి ఉంటారు. అయితే 151 ఎమ్మెల్యేలను గెలిచి అధికారంలోకి వచ్చి ఆ తరువాత కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడం అంత తేలికైన విషయమా?

ఏదో బొటాబొటీ మెజారిటీతో గెలిచిన వారు ఇలా అన్నా పర్లేదు. ఇంతటి ఘనవిజయం తరువాత భేల మాటలు మాట్లాడటం వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులకు సైతం రుచించడం లేదు. అభిమానులు జగన్ ను పులివెందుల పులి అని అభివర్ణిస్తారు. ఇటువంటి పేలవమైన మాటలతో సోషల్ మీడియా చర్చలలో, బయట చర్చలలో మిగతా వారి ముందు తల ఎత్తుకోలేకపోతున్నాం అంటూ వాపోతున్నారు.

అయితే ఉన్నఫళంగా 2-3 నెలల నుండి అప్పుల గురించి, అమరరాజా వంటి సంస్థ ఏపీ నుండి వెళ్లిపోవడం, పులిచింతల గేటు కొట్టుకుపోవడం వంటి ప్రభుత్వం వ్యతిరేక విషయాల గురించే చర్చ జరుగుతుంది. ఆ చర్చను పక్కకు మళ్లించడం కోసమే అసంబర్ధమైన ఈ ‘ప్రభుత్వ కూల్చివేత’ అనే అంశాన్ని తెర మీదకు తెచ్చారని ప్రతిపక్షాల ఆరోపణ.

కూల్చివేతల ప్రభుత్వాన్నే కూలుస్తారా అంటూ జగన్ నీకు ఎందుకు ఇంత ఇన్ సెక్యూరిటీ అంటూ టీడీపీ వారు వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులను ఎద్దేవా చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories