ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ తో యూత్ ను ఆకర్షించడంలో “ఆర్.ఎక్స్ 100” నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ మాదిరి హాట్ అండ్ బోల్డ్ మూవీగా టాలీవుడ్ లో మారుమ్రోగుతున్న ఈ సినిమా నుండి మొదటి పాట రిలీజ్ అయ్యింది. ‘పిల్లా రా’ అంటూ సాగిన ఈ పాట వినసొంపుగా ఉంది.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా, చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. విలేజ్ వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనుగుణంగానే ఈ పాటలో క్యాచీ లిరిక్స్ ఉన్నాయి. మరో ‘అర్జున్ రెడ్డి’లా సెన్సేషన్ సృష్టిస్తుందేమో చూడాలి.
ADVERTISEMENT
ADVERTISEMENT



