పవన్ కళ్యాణ్ పై కేసులు నమోదు!

Police Case filed on Pawan Kalyanసినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కొంత కాలంగా పవన్ కల్యాణ్… మీడియా కథనాలను వక్రీకరిస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారనే ఆరోపణలపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బంజారా హిల్స్‌ పోలీసులకు ఇటీవల పాత్రికేయ సంఘాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు పలు ఆధారాలను సమర్పించినట్లు తెలిసింది. కాగా, తప్పుడు ప్రచారంతో పాటు మీడియా అధినేతలను లక్ష్యంగా చేసుకుని పవన్ కల్యాణ్‌ ట్వీట్లు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories