గత రెండు, మూడు రోజులుగా సింగర్ మధుప్రియ జీవితంలో అనూహ్య పరిణామాలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రేమకధకు ‘కౌన్సిలింగ్’ పేరుతో పోలీసులు ‘ది ఎండ్’ కార్డు వేయగా, అసలు ఈ ఉదంతంలో కీలక భూమిక పోషించిన మధుప్రియ తల్లితండ్రుల మెడకు ప్రస్తుతం ఓ క్రిమినల్ కేసు చుట్టుకుంది.
శ్రీకాంత్ అనుకుని నయీమ్ అనే వ్యక్తిని మధుప్రియ తండ్రి మరియు ఇతర కుటుంబ సభ్యులు చితకబాదిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ నిమిత్తం మధుప్రియ తండ్రి పెద్ద మల్లేష్ ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే మల్లేష్ తో పాటు దాడికి పాల్గొన్న మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
తన కూతురిని ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నాడనే నెపంతో శ్రీకాంత్ పై కక్ష్యగట్టిన కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. జరిగింది పొరపాటు అయినా… దానికి భారీ మూల్యాన్నే మధుప్రియ కుటుంబం చెల్లించుకోబోతుందన్న వార్తలు వెలువడుతున్నాయి.



