రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేతకు గాయాలు!

 Ponnam Prabhakar injured in road accidentమాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కారు సిరిసిల్ల జిల్లాలో యాక్సిడెంట్ కు గురైంది. వేములవాడ రాజన్నను దర్శించుకుని వెనుదిరిగిన ప్రభాకర్ కారు వేములవాడ మండలం నాంపల్లి వద్దకు రాగానే బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ యాక్సిడెంట్ లో పొన్నం ప్రభాకర్ భుజానికి గాయమైనట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. సంఘటనా స్థలం నుంచి కారు కదిలే పరిస్థితి లేకపోవడంతో స్థానికుల సాయంతో ఆయన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

ADVERTISEMENT
Latest Stories