బుట్ట బొమ్మకు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్

Salman Khan - Pooja Hegdeఅల వైకుంఠపురములో సినిమాతో 150 కోట్ల షేర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఈరోజు తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ఎవరైనా టక్కున చెప్పే పేరు పూజా. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వేచి చూడాల్సిన పరిస్థితి. మరో వైపు గత కొంతకాలంగా బాలీవుడ్ లో కూడా పాగా వెయ్యడానికి ప్రయత్నిస్తుంది ఈ అమ్మడు.

ADVERTISEMENT

అయితే అటువంటి అవకాశం ఇప్పుడు ఆమె తలుపు తట్టింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ హీరోగా తెరకెక్కనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’లో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఈ విషయాన్ని నదియాడ్‌ వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఎన్‌జీఈఎఫ్‌) సంస్థ ఈరోజు ఉదయం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

‘ఎన్‌జీఈఎఫ్‌ కుటుంబంలోకి పూజా హెగ్డేకు స్వాగతం పలుకుతున్నాం. సల్మాన్‌ నటిస్తున్న ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’ సినిమాలో పూజా హీరోయిన్‌గా నటిస్తున్నారు’ అని ఎన్‌జీఈఎఫ్‌ ట్వీట్‌ చేసింది. పూజా నటించిన ‘హౌస్‌ఫుల్‌ 4’కు దర్శకత్వం వహించిన ఫర్హాద్‌ సామ్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సాజిద్‌ నదియాడ్‌ వాలా కథ అందించారు. 2021 ఈద్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా గనుక హిట్టయితే పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ఆమె ప్రస్తుతం ప్రభాస్ ఓ డియర్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలలో నటిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories