కమల్ హాసన్ అంత గొప్ప నటుడంటా… పవన్ కళ్యాణ్..!

posani krishna murali about pawan kalyan in bangal tiger success meetపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫాలోయింగ్ తెలియనిది కాదు. దియేటర్లలో హంగామా చేయాలన్నా, వేడుకలపై రచ్చ చేయాలన్నా పవన్ ఫ్యాన్స్ తర్వాతే ఎవరైనా… అన్న రీతిలో రెచ్చిపోతారు. అలాగే సినీ జనాలు కూడా పవన్ కున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పవన్ పేరునో, పవన్ సినిమా డైలాగ్స్ నో ప్రస్తావించడం షరా మామూలే! అంతేకాదు, పవన్ పై ఉన్న అభిమానాన్ని వ్యక్తపరిచే క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు వినియోగించే పదజాలాన్ని ఆడియో వేడుకల వంటి సందర్భాలలో కనిపిస్తూనే ఉంటుంది.

తాజాగా ‘బెంగాల్ టైగర్’ సక్సెస్ ఊపులో ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు పవన్ పై అభిమానాన్ని వ్యక్తపరిచేందుకు ‘క్యూ’లు కట్టారు. అయితే ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తమిళ ఇండస్ట్రీలో కమల్, రజనీకాంత్ లను పరిచయం చేసిన బాలచందర్ ను అడిగితే, “కమల్ హాసన్ గొప్ప నటుడని, రజనీకాంత్ గొప్ప మానవతావాదని” చెప్పారు. కానీ, పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు, గొప్ప మనిషి అని ప్రశంసలతో ముంచెత్తారు.

ADVERTISEMENT

గొప్ప మనిషిగా పవన్ ను ప్రస్తావించిన విషయంలో పెద్దగా విమర్శలకు తావు లేదు. ఒక్కో మనిషిపై ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది. అయితే కమల్ హాసన్ తో పోలుస్తూ పవన్ పై కురిపించిన ప్రశంసలు విమర్శలకు తావిస్తోంది. ఏ విధంగా కూడా పవన్ – కమల్ నటనకు సారుప్యం లేదు. ఒక్కో పాత్రకు ప్రాణం పోసే వ్యక్తిత్వం కమల్ ది. అలాగే ఈ వయసులోనూ సినిమా సినిమాకు కమల్ ప్రదర్శించే విలక్షణత ఇండియాలో మరే నటుడు చేయలేనిది.

ఒక్క మాటలో చెప్పాలంటే… జీవనం సాగించడానికి, జీవితంలో ఏదొకటి చేయాలి కాబట్టి పవన్ సినీ రంగాన్ని ఒక కెరీర్ గా ఎంచుకున్నారు. కానీ, కమల్ తన కళను ప్రదర్శించడానికి, కళామ్మ తల్లికి సేవలు అందించడానికి సినీ రంగంలో కొనసాగుతున్నారు. పవన్ ను కమల్ తో పోల్చడమంటే కమల్ స్థాయిని దిగజార్చడమేనని కమల్ అభిమానులు ఆవేదన వ్యకపరుస్తున్నారు. పొగడ్తలు చేయవచ్చు గానీ, అవి సత్యానికి దూరంగా ఉంటే విమర్శలు ఇలాగే ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories