శ్రీరంగ నీతులు పక్కవారికి చేపడానికేనా రాజా….?

Posani Krishna Murali

రాజకీయాలలో ప్రతి ఒక్కరు ఎదుటువారి పై బురద జల్లి చేతులు కడుక్కోవాలనే ఆదుర్ధాతో తమ చేతులకి అంటిన మకిలిని చూడలేక పోతున్నారు అనేది పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.

వైసీపీ కి అనధికారిక మీడియా ప్రతినిధిగా ఉంటూ వైసీపీ డిఫెన్సె లో ఉన్నప్పుడల్లా మీడియా ముందుకు వచ్చి ఏదోకటి మాట్లాడి వింటున్న వీక్షకులకు మెంటల్ ఎక్కించే మెంటల్ కృష్ణ తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చారు.

ADVERTISEMENT

ఈసారి అధికార – ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న వాలంటీర్ల పంచాయితీలో నోరు పెట్టిన పోసాని వైసీపీ తరుపున వకాల్తా పట్టుకుని చంద్రబాబు కి మహిళల పట్ల గౌరవం లేదని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అలవాటు లేదని కొన్ని శ్రీరంగ నీతులు వల్లేవేసారు.

అయితే ముందుగా బాబు కి మహిళల పట్ల గౌరవం లేదు అనే విమర్శ గురించి మాట్లాడితే.., పోసానికి కనీసం మహిళలు అనే పదం ఉచ్చరించడానికైనా హక్కుందా అనే ప్రశ్న మొదలవుతుంది. జగన్ ప్రాపకం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అవమానించడానికి రాజకీయాలతో సంబంధం లేని…,

ఆయన తల్లిని, ఆయన సతీమణిని, చివరికి పిల్లలు అనే కనీస మానవత్వం కూడా లేకుండా పవన్ కూతురు పైన కూడా సమాజము సిగ్గుపడేలా అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు మహిళలు, వారికీ గౌరవం అంటూ చాల పెద్దపెద్ద పదాలనే వాడుతున్నారు.

అలాగే రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల కుటుంబాలలోని మహిళల పట్ల పోసాని చేసిన వ్యాఖ్యలు…రైతు కుటుంబంలోని స్త్రీలు ఎక్కడైనా ఒంటి నిండా నగలు వేసుకుని, పట్టు చీరలు కట్టుకుంటారా..? అంటూ వారి కట్టుబొట్టు మీద చేసిన విమర్శలు మహిళల పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి ప్రతీకలుగా చూడాలా..?

ప్రతిపక్ష నాయకుల కుటుంబాల్లోని మహిళల పట్ల సోషల్ మీడియాలో వైకాపా నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏమనాలి..? రాష్ట్రంలో కల్తీ మద్యంతో వ్యాపారం చేస్తూ ఎందరో మహిళల పసుపు కుంకములను నేలరాస్తున్న పెద్దమనుషులకు మహిళల పట్ల ప్రేమ ఉన్నట్టా..? వారికీ వత్తాసు పలుకుతున్న ఇటువంటి వారికీ మహిళల పట్ల గౌరవం ఉన్నాయనుకోవాలా..?

సొంత కుటుంబమే అయినప్పటికీ పురందరేశ్వరి ఎన్నడూ టీడీపీ కండువా కప్పుకోలేదు. అయినప్పటికీ హద్దు దాటి ఏనాడు బాబు ఆమె రాజకీయ నిర్ణయం పట్ల విమర్శ చేయలేదు. ఎక్కడ అవమానించనూలేదు. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం అనే ఆలోచనతో రాజకీయాలను, కుటుంబ అనుబంధాలను వేరు చేసి వారి నిర్ణయాలను గౌరవించి ముందడుగు వేసిన బాబు కి మహిళల పట్ల గౌరవం లేదా..?

తన రాజకీయ పదివి ఆకాంక్షకు అడ్డుపడుతున్నారనే అక్కసుతో సొంత చెల్లెళ్ళ పైన వ్యక్తిగా విమర్శలు చూపిస్తూ, తాన్ అసొంత మీడియాలో వారి పట్ల , వారి కుటుంబ సభ్యులు పట్ల నీచమైన కథనాలు ప్రచారం చేస్తున్న వారికీ మహిళా పట్ల గౌరవం ఉన్నట్టా..? ఇలా మహిళల పట్ల గౌరవం మాటఅటుంచితే కనీస మర్యాద, విలువ కూడా ఇవ్వని వారు తోటివారికి మాత్రం శ్రీరంగ నీతులు చెప్పడంలో ముందు వరుసలో ఉంటారనేది అర్ధమవుతుంది.

ఇక హామీల మాటకొస్తే ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ ఇచ్చిన హామీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే పోసానికి, ఆయన మద్దతు పలికిన పార్టీకి అంత మంచిదనే చెప్పాలి. ప్రత్యేక హోదా మొదలు రాజధాని, అమ్మఒడి, పోలవరం, సంపూర్ణ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్….ఇలా ఎన్నో ఉదాహరణలు.

ADVERTISEMENT
Latest Stories