అలీని, పోసానిని లేపేసారు!

Posani Krishna Murali reveals about comedian aali!తాను చెప్పదలచుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ప్రముఖ రచయిత, నటుడు పోసాని క‌ృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హాస్యనటుడు సునీల్ నటించిన ‘ఉంగరాల రాంబాబు’ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో పోసాని మాట్లాడుతూ… ‘ఎప్పుడూ నవ్విస్తూ ఉండే అలీ, ఈ మధ్య కాలంలో ఓ సారి నా వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు?’ అని అడిగాను.

ADVERTISEMENT

“ఓ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించేందుకు నిన్ను, నన్ను తీసుకున్నారు. కానీ, మరొకడు వచ్చి ‘వీళ్లకు ఎందుకు అంత డబ్బు ఇవ్వాలి? వీడైతే తక్కువకు వస్తాడు… వాడైతే తక్కువకు వస్తాడు’ అని చెప్పడంతో, మన ఇద్దరిని ఈ సినిమా నుంచి తీసేశారు’ అని నాతో అలీ చెప్పాడు” అని పోసాని అన్నారు. ‘సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిన తర్వాత కూడా ఇంకా వెన్నుపోట్లు ఉంటాయా? మోసాలు ఉంటాయా? ఇంకా ఇలాంటి వెధవలు ఉంటారా? అని నేను బాధపడ్డాను’ అని పోసాని అన్నారు.

స్టేజ్ పై నవ్వించడం, నటించడం వేరని, నిజజీవితంలో ఇలాంటి సంఘటనలు చూస్తే తట్టుకోలేనంత బాధ కలుగుతుందని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో సహజంగా ఇలాంటి కధలకు కొదవలేదు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు చవిచూడడం బహు అరుదుగా జరిగే విషయం. కధంతా చెప్పిన పోసాని గారు, అది ఏ సినిమా… ఎవరు తీసేసారు… అన్న విషయం మాత్రం బయట పెట్టలేదు. ఇండస్ట్రీ “లోగుట్టు” అంటే ఇదే కదా! టైటిల్స్ తప్ప… కధంతా వివరిస్తారు..!

ADVERTISEMENT
Latest Stories