పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” టీజర్ వచ్చేసింది. ‘సంక్రాంతి’ శుభాకాంక్షలు చెబుతూ విడుదలైన ఈ టీజర్ లో అభిమానులు చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో నిరుత్సాహపడ్డారు.
ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన “సర్ధార్ గబ్బర్ సింగ్” టీజర్ లో పవన్ ధరించిన ఎర్ర తువాలు, గళ్ళ లుంగీ తప్ప చెప్పడానికేమీ లేదు. దీనికంటే అంతముందు విడుదల చేసిన గుర్రం పట్టుకుని నడిచి వచ్చిన టీజరే పర్వలేదనిపించేదిగా ఉందని ఫ్యాన్స్ సైతం నిట్టూర్పును ప్రదర్శిస్తున్నారు.
నిజానికి అంతకు ముందు టీజర్ కు, తాజా టీజర్ కు పెద్ద వ్యత్యాసం కూడా లేదు. ఇక, దేవిశ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా “గబ్బర్ సింగ్” సినిమాదే కావడంతో… “ఈ టీజర్ కోసమేనా చిత్ర యూనిట్ ఇంత సమయం తీసుకున్నదన్న” వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.
ADVERTISEMENT





