ప్రభాస్ సంగతి ఎలా ఉన్నా నాని బుక్ అయిపోయాడు

Prabhas Saaho and Nani Gang Leader release date clashయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడిందని సమాచారం. అదే నెల 30న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే చిత్రబృందం ఇప్పటిదాకా దీని మీద ఒక ప్రకటన చెయ్యలేదు. అయితే ఈ నిర్ణయం వల్ల సాహో కి నష్టమని కొందరు, మంచిదే అని కొందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ సంగతి ఎలా ఉన్నా ఇది నానికి ఇబ్బందిగా మారింది.

ADVERTISEMENT

నాని గ్యాంగ్ లీడర్ సినిమా ఆగష్టు 30న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సాహో ఆ తేదీకి రావడంతో ఎటూ పాలుపోలేని పరిస్థితి. ఇటీవలే సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి టీజర్, పాట విడుదలకు డేట్స్ అనౌన్స్ చేశారు. అయితే సాహో బృందం అధికారికంగా ఏదీ ప్రకటించకపోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఒకవేళ సాహో గనుక ఆగష్టు 30న విడుదల అయితే గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ వెళ్ళాల్సి రావొచ్చు. గ్యాంగ్ లీడర్ విడుదల తేదీని ఎన్నో నెలల ముందు ప్రకటించడం గమనార్హం.

ఇది ఇలా ఉండగా నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి(సీవీఎం) నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories