ఎప్పుడూ హిందూ మతాన్ని వ్యతిరేకిస్తారు ఎందుకు? జస్ట్ ఆస్కింగ్!

Prakash Raj amid controversy over remarks on Ramayana and Hindu beliefs

తెలుగు ప్రేక్షకుల అభిమాన నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. అయనకు తెలుగు సినీ పరిశ్రమ కూడా పెద్ద పీట వేస్తుంది. అలాగే దక్షిణాదిలో అన్ని భాషలలో కూడా అయన నటిస్తుంటారు కనుక అన్ని రాష్ట్రాలలో ఆయనకు అభిమానులున్నారు.

ఒక నటుడుగా ఇంత మంచి పేరు ప్రతిష్టలు, అభిమానులను సంపాదించుకున్నప్పుడు వాటిని కాపాడుకోవాలి కదా?

ADVERTISEMENT

ఆయన బిజేపిని, ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ అప్పుడప్పుడు ప్రశ్నలు సందిస్తుంటారు.

ఓ భారతీయ పౌరుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను, విధానాలను ప్రశ్నించడం తప్పు కాదు. కానీ బిజేపి, మోడీపై ద్వేషంతో హిందూమతాన్ని, హిందూ దేవుళ్ళ గురించి చులకనగా మాట్లాడటం ఆయనకు పరిపాటిగా మారిపోయింది.

బిజేపి రాజకీయాలలో శ్రీరాముడి పేరు వాడుకుంటుంది కనుక ఆయన శ్రీరాముడిని కూడా తన శత్రువుగానే భావిస్తున్నట్లున్నారు.

బహుశః అందువల్లేనేమో కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్నప్పుడు రామాయణం, శ్రీరామ లక్ష్మణుల గురించి నోటికి వచ్చినట్లు వాగారు.

రామలక్ష్మణులు ఇరువురూ ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలని, దక్షిణాది రాష్ట్రానికి చెందిన రావణాసురుడి తోటలో వారు పండ్లు దొంగిలించారని ప్రకాష్ రాజ్ అన్నారు.

అది చూసిన శూర్పణక జీఎస్టీతో కలిపి రెండువేల డాలర్లు చెల్లించాలని అడిగిందని కానీ తమ వద్ద అంత డబ్బు లేనందున కట్టలేమనడంతో రామ-రావణుల మద్య వైరం మొదలైందని ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా అన్నారు.

ఇన్ని సినిమాలు చేసి ఇంత అనుభవం, లోక జ్ఞానం సంపాదించిన ప్రకాష్ రాజ్ కోట్లాది మంది ఆరాధించే శ్రీరామలక్ష్మణుల గురించి ఇంత చులకనగా మాట్లాడటం చాలా బాధాకరం.

హిందువుల మనోభావాలు దెబ్బ తీసినందుకు ఆయనపై నెటిజన్స్, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి అయనని సినిమాలలో తీసుకోరాదని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

అయినా ప్రకాష్ రాజ్‌కు బిజేపి, మోడీతో పడకపోతే వారితో అమీతుమీ తేల్చుకోవాలి కానీ ప్రతీసారి ఇలా హిందూమతం గురించి చులకనగా మాట్లాడటం దేనికి? ఇదేవిధంగా ఇస్లాం లేదా క్రీస్టియన్ మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందా? జస్ట్ ఆస్కింగ్!

ADVERTISEMENT
Latest Stories