ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ పలువురు పై ప్రశ్నల రూపం లో విమర్శలు చేస్తుంటారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చుట్టూ అనేక ప్రశ్నలు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాయి.
కానీ అందుకు ప్రకాష్ రాజ్ ఇప్పటికి సిద్ధంగా లేరనిపిస్తుంది. ధర్మస్థలి వివాదం లో ప్రకాష్ రాజ్ పేరు బయటకు రావడం తో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ వెంటపడుతుంది.
అయితే జస్ట్ ఆస్కింగ్ ఒకే కానీ ఆన్సరింగ్ నాట్ ఒకే అన్నట్టుగా ప్రకాష్ తన ముందు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మీడియా మీద గోడి మీడియా అంటూ విమర్శలు చేయడం, వారి ప్రశ్నలకు నాదగ్గర సమాధానం లేదు అనేలా చప్పట్లతో బదులుచెప్పడం తో ప్రకాష్ రాజ్ పై విమర్శల బాణాలు ఎక్కువయ్యాయి.
ఇక ఈ వివాదం ఇలా ఉంటే ఇప్పుడు మరోకొత్త వివాదంలో ప్రకాష్ రాజ్ ఇరుక్కున్నారు. దేశంలో ఒక ఓటర్ కి ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులు ఉంటే అది భారత ఎన్నికల నింబధనలను ఉల్లగించినట్టే అవుతుంది. అయితే ప్రకాష్ రాజ్ కి ఒకే సమయంలో దేశంలో నాలుగు రాష్ట్రాలలో ఓటర్ గుర్తింపు కార్డు లు ఉన్నట్టు 2019 లో ఆయన పై కేసు నమోదయ్యింది.
2019 లో దిలీప్ కుమార్ అనే న్యాయవాది హలాసురు గేట్ పోలీస్ స్టేషన్ లో నటుడు ప్రకాష్ రాజ్ కు బహు ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ ఫిర్యాదు చేసారు. ప్రకాష్ రాజ్ కి కర్ణాటక తో పాటుగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఏక సమయంలో ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయంటూ దిలీప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో నమోదుచేశారు.
అయితే ఆ వివాదం పై ప్రకాష్ రాజ్ ఇప్పటికి విచారణ కొరకు న్యాయస్థానం ముందు హాజరుకాలేదు. దీనితో బెంగళూర్ లోని 48 వ ACJM కోర్టు శనివారం ప్రకాష్ రాజ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శకుడిగా, విశ్లేషకుడిగా, సెక్యులర్ విధానాల పేరుతో భారత హిందూ వ్యవస్థను కించపరిచేలా పోస్ట్లు పెట్టె ప్రకాష్ రాజ్ కి భారతదేశ ఎన్నికల వ్యవస్థ నిబంధలను తెలియవా.?
ఒక వేళ తెలిసినా అవి ఆయనకు వర్తించవు అనే భావనలో ప్రకాష్ ఉంటున్నారా.? పలు భాషా చిత్రాలలో నటించడం తప్పుకాదనే లా పలు రాష్ట్రాలలో ఓటర్ గుర్తింపు కార్డులు ఉండడం కూడా నేరం కాదని ప్రకాష్ భావిస్తున్నారా.? నేను మోనార్క్ అన్నట్టుగా నన్నెవరూ ప్రశ్నించకూడదు అనే భావన లో ప్రకాష్ ఉంటున్నారా.?
అందుకే ప్రశ్నలను చూసి ప్రకాష్ పక్కకు తప్పుకుంటున్నారా.? మీడియా అంటే విలువ లేదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు అనేలా ప్రకాష్ వ్యవహరిస్తున్న తీరు ఆయన ఇన్నాళ్ల రాజకీయ, సినీ జీవితానికి మాయని మచ్చల మారుతుంది. ఇలా ఒక్కొక్కటిగా తనను చుట్టుముడుతున్న వివాదలకు సంబంధించిన కనీస ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని ప్రకాష్ రాజ్ కు ఎదుటివారిని జస్ట్ ఆస్కింగ్ అనే అర్హత, హక్కు ఉంటుందా.?




