జస్ట్ ‘ఆస్కింగ్’ కాదు జస్ట్ ‘ఆన్సరింగ్’…

Prakash Raj on Dharmasthala Row: Actor Promises Clarity

జస్ట్ ఆస్కింగ్ అంటూ నటుడు ప్రకాష్ రాజ్ కొంతమంది సెలక్టీవ్ పీపుల్ టార్గెట్ గా సోషల్ మీడియాలో చేసే విమర్శలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారతాయి.

బీజేపీ మీదున్న రాజకీయ ద్వేషం ప్రకాష్ రాజ్ ను ఏస్థాయికైనా తీసుకువెళ్లగలదు అని పవన్ టార్గెట్ గా ప్రకాష్ చేసే సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చెప్పొచ్చు. పవన్ తుమ్మినా, దగ్గినా కూడా తప్పే అన్నట్టుగా ప్రకాష్ రాజ్, పవన్ తన రాజకీయ పార్టీని ఎలా నడపాలో.?

ADVERTISEMENT

తానూ రాజకీయంగా ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో.? ఏ రాష్ట్రంలో రాజకీయం చెయ్యాలో అనేదాని పై కూడా పవన్ ను టార్గెట్ చేస్తుంటారు. సనాతన ధర్మం కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ తనను తానూ ఒక సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తిగా చిత్రీకరించుకుంటారు.

అయితే ఇప్పుడు ఆ సెక్యులర్ ముసుగు వెనుక ఉన్న తెర తుడిచిపెట్టేసేలా ఆయన మీద మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఎప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎదుటివారిని ప్రశ్నిస్తూ, వారి పై బురద జల్లుతూ సోషల్ మీడియాలో హడావుడి చేసే ప్రకాష్ రాజ్ ఇప్పుడు జస్ట్ ఆన్సరింగ్ అంటూ అదే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు ఎదుర్కుంటున్నారు.

గతంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థలి వివాదం వెనుక ప్రకాష్ రాజ్ పాత్ర ఉందంటూ వార్తలు గుప్పుమంటడంతో ప్రకాష్ కు వ్యతిరేకంగా జస్ట్ ఆన్సరింగ్ సార్ అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ధర్మస్థలి పరిసర ప్రాంతాలలో వందలాది మంది ని అత్యాచారాలు చేసి హత్యలు చేసారని, ఆ హత్యకు గురికాబడిన వారిని ఆ ప్రాంతంలోనే రహస్యంగా పూడ్చి పెట్టారంటూ ఒక పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులను ఆశ్రయించాడు.

అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనముగా మారింది. అయితే ఆ శవాల వెలికితీత అంటూ రంగంలోకి దిగిన పోలీసులకు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్టుగా ఆధారాలు లభించలేదు. దీనితో ధర్మస్థలి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అసలేం జరుగుతుంది అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమయింది.

తాజాగా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య గురువారం నాడు కర్ణాటక హైకోర్టు లో దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో వెలుగులోకి వచ్చిన పేర్లు కర్ణాటక తో పాటుగా తెలుగు రాష్ట్రాలలోను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ధర్మస్థలి పట్ల తానూ చేసిన కామెంట్స్ వెనుక భారీ స్కాం దాగివుందని, తానూ కేవలం ఆ చదరంగంలో పావును మాత్రమే అని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు కూడా ఈ వివాదంలో భాగముంది అంటూ ప్రకాష్ రాజ్ పేరును చిన్నయ్య బయటపెట్టారు.

అయితే దీని పై నటుడు, రాజకీయ మేధావి అని చెప్పుకునే ప్రకాష్ రాజ్ కూడా స్పందిస్తూ ధర్మస్థలి వంటి పుణ్య క్షేత్రం కు సంబంధించిన వివాదంలో తన పేరు మీద జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ, ఇది కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఒక సున్నితమైన అంశమని త్వరలోనే స్వయంగా తానే మీడియా ముందుకొచ్చి వివరణ ఇస్తానన్నారు.

ADVERTISEMENT
Latest Stories