ముంబైలో ప్రణవ్ ధనవాడే విధ్వంసానికి ప్రతిరూపంలా నిలిచిన బౌలింగ్ ఫిగర్స్ అవి. సాధారణంగా జట్టులో ఒక్క బౌలర్ అయినా మినిమమ్ ఎకానమీ మైంటైన్ చేస్తారు. కానీ ప్రణవ్ ‘దూకుడు’కు ఆర్య గురుకుల్ బౌలర్స్ అందరూ ఓవర్ కు 15 పరుగుల సగటును సమర్పించుకున్నారు. బ్యాట్స్ మెన్లు సెంచరీ, డబుల్ సెంచరీ మాట ఎలా ఉన్నా… బౌలర్లు ట్రిపుల్ సెంచరీ నమోదు చేయడం చెప్పుకోదగ్గ విషయం.
ఎనిమిది మంది బౌలర్లను వినియోగించగా, అందులో ఒకరు ట్రిపుల్ సెంచరీ, ముగ్గురు డబుల్ సెంచరీలు, ఒకరు సెంచరీ, మరొకరు హాఫ్ సెంచరీలు సమర్పించుకున్నారు. ఇద్దరు బౌలర్లు కేవలం రెండు ఓవర్లే వేయడంతో హాఫ్ సెంచరీలకు కాస్తంత దూరంలో నిలిచిపోయారు. ఈ బౌలింగ్ ఫిగార్లతో కూడిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. చూసిన క్రికెట్ ప్రేమికులంతా “ఏంటీ అరాచకం” అంటూ ప్రణవ్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ప్రణవ్ దెబ్బకు 8 వికెట్లు సాధించిన కామత్ ప్రతిభ మరుగున పడిపోయింది. కేవలం 7.5 ఓవర్లు వేసి ఓవర్ కో వికెట్ చొప్పున 8వికెట్లను సొంతం చేసుకున్నాడు కామత్. దీంతో 15 ఓవర్లలో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది గురుకుల్ టీం.





