Prashant Neel

కెజిఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా క్రేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. కెజిఫ్ సిరీస్ తో తనతో పాటుగా హీరో యష్ ను కూడా పాన్ ఇండియా స్టార్ గా మలిచారు ప్రశాంత్.

పాన్ ఇండియా స్టార్ గా పాపులర్ అయిన హీరో యష్ కెజిఫ్ తరువాత ఒక్క సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు కానీ దర్శకుడు ప్రశాంత్ మాత్రం ప్రభాస్ తో సలార్ మూవీని తెరకెక్కించి మరో పాన్ ఇండియా హిట్ అందుకుని తన క్రేజే ను మరింతగా పెంచుకున్నారు.

Also Read – వైసీపి దుష్ప్రచారానికి ఇది మరో నిదర్శనం కాదా?

సౌత్ నుంచి రాజమౌళి తరువాత ఆ స్థానంలో ప్రశాంత్ నీల్ నిలిచాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు అంటున్నారు సినీ అభిమానులు. తన సినిమాలలో హీరో క్యారెక్టర్ ను ప్రశాంత్ నీల్ ఆవిష్కరించే విధానానికి నేటి తరం యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

టేకింగ్ లో నలుపు, వైలెన్ తో ఎరుపు కలగలిపిన కెజిఫ్, సలార్ మూవీల బ్లాక్ బస్టర్ తరువాత మాస్ పల్స్ ను ఎక్కువగా ఆకర్షించగలిగే మరో పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ తారక్ తో ప్రశాంత్ తన తరువాత మూవీని చాల గట్టిగానే ప్లాన్ చేసినట్లు ట్రేడ్ వర్గాలలో చర్చ జరుగుతుంది.

Also Read – అన్న అలా…చెల్లి ఇలా..!

అలాగే ఇటు RRR తరువాత వచ్చిన దేవరతో కలెక్షన్ల దుమ్ము దులుపుతున్న జూ. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో, ఆ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిని అందుకుంటాయో అంటూ సాధారణ ప్రేక్షకుడు సైతం వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఆ మాస్ జాతర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే జూ. ఎన్టీఆర్ తో మూవీ తరువాత ప్రశాంత్, ప్రభాస్ కాంబోలో సలార్ -2 ను సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినపడుతున్న వేళ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో స్టార్ హీరో తో కలిసి ప్రశాంత్ దిగిన ఫొటో వైరల్ గా మారింది.

Also Read – జగన్ ఉత్తర కుమారుడేనా?

దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నిర్మాత డీవీవీ దానయ్యతో కలిసున్న ఫోటో ఒకటి ఇప్పుడు ఇంటర్ నెట్ లో సందడి చేస్తుంది. దీనితో ప్రశాంత్ లిస్టు లో తరువాత ఉన్న హీరో రామ్ చరణే అంటూ మెగా ఫాన్స్ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

అయితే ఆ అభిమానుల ఊహాగానాలు నిజమవ్వాలి అన్నా అది ఇప్పుడే సాధ్యమయ్యే పనికాకపోవచ్చు. ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ తరువాత ప్రభాస్ మూవీ ఉంది. అలాగే చెర్రీకి గేమ్ చేంజెర్ తరువాత ఉప్పెన ఫ్రేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక మూవీ కి కమిట్ మెంట్ ఉంది.

అలాగే ఇటు పుష్ప -2 తరువాత, రంగస్థలం కాంబో (సుక్కు, చెర్రీ) మరోసారి వెండి తెర మీద తమ మ్యాజిక్ చూపించడానికి సై అనడానికి సిద్ధంగా ఉన్నట్టు టాక్ వినపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్, రామ్ చరణ్ కాంబినేషన్ సెట్ అవ్వడానికి దాదాపు మరో రెండేళ్ల సమయం పట్టినా ఆశ్చర్యం లేకపోవచ్చు.

అయితే ప్రశాంత్ నీల్ వెనుకున్న బ్యాక్ గ్రౌండ్ లిస్ట్ చూస్తే తారక్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా అందరు పాన్ ఇండియా స్థాయి స్టార్ హీరోలే కావడం ఇక్కడ విశేషం. అలాగే కెజిఫ్ సిరీస్ కు కూడా ప్రశాంత్ నీల్ ఇంకా ఒక ఎండ్ కార్డు వెయ్యనేలేదు. కెజిఫ్ తో మొదలైన ప్రశాంత్ నీల్ చరిత్ర నిర్వీరంగా సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉండాలని ఆశిద్దాం.