ప్రశ్న రావణ్ అరెస్టుతో కూటమి ప్రభుత్వం పై తీవ్ర పొలిటికల్ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించిన అనేక గొంతులు నేడు మిగబోయాయి. రావణ్ అరెస్టు వ్యతిరేకిస్తూ కొందరు, ఖండిస్తూ మరికొందరు, అన్యాయమని, అక్రమమని ఇలా మీడియా ముందు నానా హంగామా చేసారు.
రావణ్ అరెస్ట్ ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలతో పాటుగా ప్రాంతీయవాద రాజకీయాలు కూడా చేసేందుకు సిద్దమైన అనేక శక్తులు నేడు రావణ్ ను ఒంటరిని చేస్తూ కలుగులో కి వెళ్లిపోయాయి. రావణ్ కోసం ముందడుగు వేస్తె అది వారి రాజకీయ పతనానికి తొలి అడుగు అని గ్రహించిన నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
కలియుగంలో రావణ్ నే గెలుస్తాడు గెలిపిస్తాము అంటూ నాడు తొడలుకొట్టిన వైసీపీ కాపు నేత నేడు రావణ్ అరెస్టు ముగిసిన అధ్యాయం మాదిరి మరిచారు. రావణ్ కోసం జగన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ లు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి.
ఇక రావణ్ కోసం నేను సైతం అంటూ న్యాయపోరాటం చేసిన నేతలు సైతం ఇప్పుడు మీడియా ముందుకు కూడా రాలేకపోతున్నారు. రావణ్ బూతు పురాణాలను ‘శ్రవణా’నందంగా ఆస్వాదించిన నేతలు ఇప్పుడు రావణ్ ఆర్తనాదాలు వినపడకుండా చెవులు మూసుకున్నారు.
ఇక జస్ట్ ఆస్కిన్గ్ అంటూ సోషల్ మీడియాలో రావణ్ కోసం ప్రశ్నించిన గొంతులు ఇప్పుడు జస్ట్ సైలెంట్ అయిపోయాయి. ఇలా నాడు రావణ్ కోసం మేము సైతం అంటూ కూటమి మీదకు దండెత్తుకొచ్చిన రావణ సైన్యం ఒక్కసారిగా వెనక్కి తగ్గడం వెనుక ఉన్న ఆ ఉన్న ఆ గండికోట రహస్యమేమిటి.?
అలాగే ఒక్క రావణ్ చుట్టూ సెక్కులరిజం ముసుగులో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవచంలా నిలబడ్డ ఈ సోకాల్డ్ నేతలంతా ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయారు అంటే ప్రశ్న అరెస్టు కు ఈ సోకాల్డ్ నేతందరికి సరైన జవాబు దొరికిందనుకోవాలా.?
ఎవరి కళ్ళల్లోనో ఆనందం కోసం, ఎవరి పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమో పరితపించిన రావణ్ చివరికి చేసిన తప్పుకి శిక్ష గా జైల్లో అరణ్యవాసం చేస్తున్నారు. అలాగే నాడు రావణ్ కోసం గళం వినిపించిన నేతలు ఇప్పుడు అజ్ఞాతవాసం లో సేద తీరుతున్నారు.




