ప్రత్తిపాటిని అరెస్ట్ చేస్తే వైసీపి గెలుస్తుందా… టిడిపి, జనసేనలు ఓడిపోతాయా?

Prathipati Sarath arrested

మాజీ మంత్రి, సీనియర్ టిడిపి నేత ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్ బాబుని గురువారం తెల్లవారుజామున ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.

ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ, కుమారుడు షార్ట్ బాబు, ఇంకా పలువురు డైరెక్టర్లుగా ఉన్న అవెక్సా కార్పొరేషన్‌కు టిడిపి హయాంలో భారీగా కాంట్రాక్టులు పొందిందని, వాటి ద్వారా అవెక్సా కార్పొరేషన్‌కు భారీగా ఆదాయం లభించిందని, కానీ జీఎస్టీ చెల్లించకుండా ఎగవేసిందనే ఆరోపణలతో శరత్ బాబుని టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.

ADVERTISEMENT

ఆ సంస్థలో ఆయన 2019 డిసెంబర్ 9 నుంచి 2020 ఫిబ్రవరి 14వరకు మాత్రమే అదనపు డైరెక్టర్‌గా వ్యవహరించారని, ఆ సంస్థ లావాదేవీలతో తన కుమారుడికి ఎటువంటి సంబంధమూ లేదని ప్రత్తిపాటి పుల్లారావు చెపుతున్నారు.

టిడిపి నేతలందరూ శరత్ బాబు అరెస్టుని ఖండిస్తున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం సంస్థ దీనిపై దర్యాప్తు చేస్తుంటే, జగన్‌ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రత్తిపాటి పుల్లారావుని వేధించేందుకే ఆయన కుమారుడిని అరెస్ట్ చేయించిందని వాదిస్తున్నారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా పార్టీలో ముఖ్య నేతలపై ఏదో కేసు నమోదు చేయించి భయపెడుతూ ఎన్నికలలో పోటీ చేయకుండా అడ్డుకోవాలని జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వాదిస్తున్నారు.

టిడిపి, జనసేనల జండా సభ విజయవంతం అవడంతో వైసీపి కాలాకేయ సైన్యం పవన్‌ కళ్యాణ్‌పై మూకుమ్మడిగా దాడి ప్రారంభించడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రత్తిపాటి శరత్ బాబుని అరెస్ట్ చేయడం కూడా అందుకే కావచ్చు. కనుక జగన్‌ ప్రభుత్వం త్వరలో ఇంకా చాలా మంది టిడిపి నేతలని లేదా వారి కుటుంబ సభ్యులను ఇదేవిదంగా వేధించవచ్చు.

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి ప్రగల్భాలు పలుకుతూ, ధర్మపన్నాలు వల్లిస్తూ తన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రతిపక్షనేతలపైకి ఉసిగొల్పుతుండటం, పోలీసులతో వారి కుటుంబాలను వేధిస్తుండటం ప్రజలు గమనించలేదనుకోవడం అవివేకమే.

ఈ చర్యలన్నీ జగన్మోహన్‌ రెడ్డి ఓటమి భయాన్నే సూచిస్తున్నాయని చెప్పవచ్చు. జగన్మోహన్‌ రెడ్డికి నిజంగానే ఎన్నికలలో వైసీపి 175/25 సీట్లు గెలుచుకోగలదనే ధీమా ఉంటే ఈవిదంగా ప్రతిపక్షాలను వేధించాల్సిన అవసరం ఏమిటి?

ఒకవేళ టిడిపి నేతలపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయిస్తే రాబోయే ఎన్నికలలో వైసీపి తప్పకుండా గెలుస్తుందా?టిడిపి, జనసేనలు ఓడిపోతాయా?అంటే కాదనే చెప్పొచ్చు.

చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినందుకు ప్రజలలో ఆయన పట్ల సానుభూతి పెరిగింది. వైసీపి పట్ల మరింత వ్యతిరేకత పెరిగింది. జగన్‌ ప్రభుత్వం ఈవిదంగా టిడిపి, జనసేనలపై రాజకీయ కక్షలకు పాల్పడిన ప్రతీసారి జగన్‌ గ్రాఫ్ పడిపోతూనే ఉంటుంది. అదే సమయంలో టిడిపి, జనసేనల పట్ల ప్రజలలో సానుభూతి పెరుగుతూనే ఉంటుంది. ఇంత చిన్న విషయం తెలుసుకోకుండా కేసులు, అరెస్టులతో ప్రతిపక్షాలను భయపెట్టేసి వైసీపిని ఎన్నికలలో గెలిపించేసుకోవచ్చని ఎలా అనుకుంటున్నారో?

ADVERTISEMENT
Latest Stories